Last ball of chief minister

last ball of chief minister, AP State Reorganization Bill 2013, Telangana Bill, Kiran Kumar Reddy, Ap State Assembly

last ball of chief minister

ముఖ్యమంత్రి ఆఖరు బంతి

Posted: 01/25/2014 06:05 PM IST
Last ball of chief minister

ముఖ్యమంత్రి ముందు నుంచి చెప్తూ వస్తున్నట్లుగా ఆఖరు బంతిని ఈ రోజు ఆడారు. పార్లమెంటు నియమాలను, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిన రాష్ట్ర పునర్విభజన బిల్లు కి సాధికారత లేదన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. 

రాష్ట్రపతి శాసనసభకు పంపించిన బిల్లు పూర్తిగా తప్పుల తడక అన్నారు కిరణ్ కుమార్ శాసనసభలో మాట్లాడుతూ.  అంతేకాదు, ఇది బిల్లు ముసాయిదానా లేకపోతే బిల్లా అన్నది కేంద్రానికి స్పష్టంగా తెలిసినట్లు లేదన్నారాయన.  విభజన బిల్లు లక్ష్యమేమిటన్నది అందులో లేదని ఆ అవసరం ఏమొచ్చిందన్నది తెలియజేయలేదని కూడా అన్నారు ముఖ్యమంత్రి.  కేంద్రానికే స్పష్టత లేనప్పుడు దాని మీద అసెంబ్లీ ఉద్దేశ్యాలెలా చెప్పగలుగుతామని ఆయన ప్రశ్నించారు. 

ముందేమో దీన్ని బిల్లు అన్నారు.  అయితే దీనిలో లక్ష్యాలు, ఆర్థిక సంబంధమైన ప్రస్తావన లేదని అన్నప్పుడు కేంద్ర హోం సెక్రటరీ ఇది కేవలం బిల్లు ముసాయిదా అని చెప్పారు.  బిల్లు ముసాయిదాను రాష్ట్రపతికి పంపుతారా అని అడిగారు ముఖ్యమంత్రి.  బిల్లుని సమగ్రంగా రూపొందించిన తర్వాత దాని మీద న్యాయసలహాలు తీసుకున్న తర్వాతనే రాష్ట్రపతికి పంపవలసివుంటుందని అన్నారాయన.  రాజ్యాంగంలోని 3 వ అధికరణ ప్రకారం బిల్లుని పంపాలి కానీ రాష్ట్రపతికి బిల్లు ముసాయిదా పంపటం సరికాదని కూడా అన్నారు ముఖ్యమంత్రి.

రాష్ట్ర పునర్విభజన బిల్లును రూపొందించటంలో కేంద్రం పార్లమెంటు ప్రోసీజర్ లోని నియమాలు 11,12,9, 4, 5, 32, 54 లను ఉల్లంఘించటం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు.  రాష్ట్రమే గనక ముక్కలైతే ఒకరోజు రెండురోజులు కాదు కొన్ని సంవత్సరాల వరకు ఇరు ప్రాంతాల మధ్య పోరాటాలు జరుగుతాయి.  నేను అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించలేను అని ముందే కేంద్రానికి తెలియజేసానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles