Trs leader ready to join congress

trs leader ready to join congress, Congress party Telangana, TRS party merger with Congress party, KCR, Manchirial MLA joins Congress party

trs leader ready to join congress

విలీనానికి తెరాస వెనకడుగు, కాంగ్రెస్ ఆకర్ష మొదలు

Posted: 01/25/2014 09:13 AM IST
Trs leader ready to join congress

అదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసన సభ్యుడు గడ్డం అరవింద రెడ్డి తెరాస ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి సిద్ధమయ్యారు. 

తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యటానికి సిద్ధమేనని ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర సమితి, తీరా తెలంగాణా బిల్లుని రూపొందించి విభజన తతంగాన్ని ముందుకు నడుపుతున్నా, విలీనం విషయం గాలికి వదిలిన తెరాసను దెబ్బతీయాలంటే తెరాస లోంచి తమ పార్టీలోకి నాయకులను ఆహ్వానించటం ఒక మార్గమని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పావులు కదపటం మొదలు పెట్టిందని దీనితో అర్థమౌతోంది.

తెరాస నాయకులను ఆకర్షించే ప్రయత్నం చెయ్యటం మొదలవగానే తెరాసలో భయం పట్టుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నమ్ముతోందని, అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.  అన్ని సంవత్సరాలు ఉద్యమం సాగించి, తెలంగాణా వచ్చే సమయానికి తెరమరుగవటం తెరాసకు ఇష్టం లేదు.  ఉద్యమం వలన వచ్చిన జనాదరణను లాభసాటిగా మలుచుకోదలచుకున్న తెరాస విలీనం విషయం దాటవేస్తోంది. 

అంతే కాదు వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు కూడా ఉండదని ఘంటాపథంగా చెప్తుంటే, రాజకీయంగా సీమాంధ్రను త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా కూడా దక్కకపోవటం బాధాకరమే.  తాజాగా వచ్చిన సర్వే నివేదికల ప్రకారం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం నుంచే ఊడ్చిపెట్టుకుని పోయే అవకాశం కనిపిస్తోంది.  దాన్ని ఎదుర్కుంటూ కనీసం తెలంగాణా ప్రాంతాన్నైనా దక్కించుకోవటానికి కాంగ్రెస్ తెలంగాణా విజయయాత్రలు కూడా నిర్వహించింది.  కానీ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం తృప్తి మేరకు తెలంగాణాలో ప్రాబల్యాన్ని సంపాదించి పెట్టలేకపోయారు. 

అరవిందరెడ్డితో పాటు ఇంకా కొంత మంది కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది.  అయితే, అరవిందరెడ్డి ఎలాగూ నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయనను, అంతకు ముందే వ్యతిరేకంగా వ్యవహరించిన విజయశాంతిని వదిలేసి మిగతావాళ్ళు పార్టీని వదిలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెడుతోంది తెరాస.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles