Akkineni cremated with state honors

Akkineni cremated with state honors, Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna, State honors to Akkineni, last rites to Akkineni, Akkineni Cremated at Annapurna Studios

Akkineni cremated with state honors

తిరిగిరాని లోకాలకు పోతున్న కధానాయకుడికి ఘనమైన వీడ్కోలు

Posted: 01/23/2014 05:24 PM IST
Akkineni cremated with state honors

ఒక కళాకారుడిగా జీవితమంతా మెచ్చుకోళ్ళు, సత్కారాలను పొందిన అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు కూడా ఘనంగా జరిగాయి.  తిరిగిరాని లోకాలకు పోతున్న ప్రియతమ కధానాయకుడికి పోలీసు లాంఛనాలతో ఘనంగా వీడ్కోలిచ్చారు.  

అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో పలువురు ప్రముఖులు గంధపు చెక్కలను పేర్చగా నాగేశ్వరరావు చితికి పెద్ద కుమారుడు వెంకట్ నిప్పంటించగా రెండవ కుమారుడు నాగార్జున,  మనుమలు తోడు నిలిచి శ్రద్ధాంజలి ఘటించారు.  పోలీసులు రెండు రౌండ్లను గాలిలోకి పేల్చారు, పోలీస్ బ్యాండ్ గౌరవ వందనం చేసింది.  

అక్కినేని అభిమానులు, చలనచిత్ర రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అక్కినేని కుటుంబానికి సన్నిహితులు, బంధువులు తరలి వచ్చి ఫిల్మ్ నగర్  నుండి అంతిమ యాత్రలో పాల్గొని, జాలువారే కన్నీళ్ళతో కడసారి నివాళులర్పించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles