Lagadapati was pulled down physically in mahadharna

Lagadapati was pulled down physically in Mahadharna, APNGOs Association Mahadharna, Ashok Babu, Lagadapati Rajagopal

Lagadapati was pulled down physically in Mahadharna

ధర్నాలో లగడపాటిని లాగిపడేసిన తెలంగాణా వాది

Posted: 01/22/2014 02:15 PM IST
Lagadapati was pulled down physically in mahadharna

ఎపిఎన్జీవోలు హైద్రాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రసంగిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ని తెలంగాణా మద్దతుదారు కిందికి లాగివేయటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. 

ఈ కార్యక్రమానికి ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, మంత్రులు గంటా శ్రీనివాసరావు,  ఏరాసు ప్రతాపరెడ్డి, తెలుగు దేశం పార్టీ ఎంపీ సి.ఎమ్ రమేష్, శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఇంకా ఇతర ఎపిఎన్జీవో నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు.  

అశోక్ బాబు మాట్లాడుతూ, ఉమ్మడి రాజధాని ఏర్పడినట్లయితే ప్రస్తుతం కేజ్రీవాల్ ఢిల్లీలో ఎదుర్కుంటున్న సమస్యలే ఎదుర్కోవలసివస్తుందని అన్నారు.  ఉమ్మడి రాజధానంటే రాజు లేని రాజ్యంలా మారుతుందని అన్నారు అశోక్ బాబు.  పార్టీలకు అతీతంగా ఏకత్రాటి మీద సమైక్యనినాదంతో నడవటం ఆనందదాయకమని అశోక్ బాబు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles