15 veerappan associates get relief from death penalty

4 veerappan associates relief death penalty, Smuggler Veerappan, 15 death penalties reduced life, SC guidelines on

4associates get relief from death penalty

4 వీరప్పన్ అనుచరులకు ఉరిశిక్ష నుంచి విముక్తి

Posted: 01/21/2014 12:28 PM IST
15 veerappan associates get relief from death penalty

క్షమాభిక్ష పిటిషన్ మీద జరుగుతున్న జాప్యం దృష్ట్యా నలుగురు వీరప్పన్ అనుచరులతో సహా మొత్తం 15 మందికి ఉరిశిక్షను జీవిత ఖైదులోకి మార్పు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది,  ఈ సందర్భంలో, ఉరిశిక్షపడ్డ ఖైదీల క్షమాభిక్ష పిటిషన్ల మీద సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చిన కీలకమైన తీర్పులో ఏ సందర్భాలలో మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చో ఈ కింది విధంగా తెలియజేసింది. 

1. క్షమాభిక్ష పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరుగుతున్నప్పుడు దానిని జీవిత ఖైదుగా మార్పు చేసే ప్రతిపాదన ఉన్నట్లుగా గ్రహించివచ్చు.

2. క్షమాభిక్షకు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఖైదీలు ఏకాంతవాస శిక్షను అనుభవిస్తూ మానసికంగా అస్వస్థత పాలైతే వారి శిక్షను జీవితఖైదులోకి మార్పిడి చెయ్యవచ్చు. 

మరణశిక్ష అనుభవిస్తున్న వారికి కానీ ఇతర ఖైదీలకు కానీ ఏకాంతవాస కారాగారవాస శిక్షను అమలుచెయ్యటం రాజ్యాంగానికి విరుద్ధమని తెలియజేసిన సుప్రీం కోర్టు, క్షమాభిక్షను తిరస్కరించిన పక్షంలో ఆ విషయాన్ని ఖైదీ కుటుంబ సభ్యులకు తెలియపరచటం తప్పనిసరని కూడా స్పష్టంగా చెప్పింది. 

లోగడ ఉరిశిక్షపడ్డ వీరప్పన్ అనుచరులు నలుగురూ ఫిబ్రవరి 2013 లో సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.  మానవ హక్కుల సంఘం కూడా ఉరిశిక్షను రద్దు చెయ్యమని సిఫారసు చేసింది.  దానితో సుప్రీం కోర్టు అదే నెలలో ఉరిశిక్ష అమలు చెయ్యకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది.

కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఆరువేల కిలోమీటర్ల వైశాల్యంలో గల అడవిలో యధేచ్ఛగా చందనపు దుంగలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్ అక్టోబర్ 18, 2004 లో ఎన్ కౌంటర్ లో మరణించాడు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles