Tourists impressions on indians

Foreign Tourists in India, Tourisst impressions on India, Foreign tourists warned, Rape fastest growing Indian crime, Sexual attacks on foreign tourists

Tourists impressions on Indians

పర్యాటకుల మీద అత్యాచారం - పెద్ద తప్పుతో చిన్న తప్పులు మాఫీ

Posted: 01/18/2014 03:54 PM IST
Tourists impressions on indians

టివి ప్రకటనలలో భారత దేశం గురించి ప్రంపంచానికి మనం ఎటువంటి అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాం, మన నడవడి గురించి మనం ఎటువంటి సంకేతాలనిస్తున్నాం అన్నదానిమీద చాలా మంచి సందేశాత్మకమైన ప్రకటనను అమీర్ ఖాన్ తో ప్రదర్శించటం జరుగుతోంది. 

ఒక సన్నివేశంలో కారులో పోతూ పోతూ అరపండు తొక్కలను బయటకు విసిరేస్తే అవి పక్కనే పోతున్న కారులో ఉన్న విదేశీయుల మీద పడుతుంది.  మరో సన్నివేశంలో స్వయానా తల్లి తన తనయుడి చేత బహిరంగ స్థలంలో మూత్రం పోయిస్తుంటుంది.

అయితే ఇవన్నీ చాలా చిన్నవి అనిపించే కాండలు జరుగుతున్నాయి మన దేశ రాజధానిలో. 

విదేశాలనుంచి భారత దేశం వచ్చే మహిళా పర్యాటకులకు ఆయా దేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.  ముఖ్యంగా యుకె, కెనడా, ఫ్రాన్స్ దేశాలు గత వారంలో 51 సంవత్సరాల డానిష్ మహిళ మీద జరిగిన అత్యాచారం, దోపిడీ ల దృష్ట్యా భారత్ లో పర్యటించటానికి వచ్చే వారికి జాగ్రత్తగా ఉండమని సూచనలిస్తున్నారు.  ఒంటరిగానే కాదు సామూహికంగా వెళ్లినప్పుడు కూడా జాగరూకతతో మెలగమని యుకె విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో హెచ్చరికలు చేసారు. 

ఫ్రెంచ్ దేశం మాత్రం కేవలం ఢిల్లీ గురించి మాత్రమే అది సురక్షితమైన ప్రదేశం కాదని చెప్తోంది.  భారత దేశంలో బాగా ఎక్కువగా వ్యాపిస్తున్న నేరం లైంగిక అత్యాచారమని ఆయా దేశాలు వాళ్ళ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు చెప్తున్నాయి. 

వీటి ముందు అరటి పండు తొక్కలు పడేయటం, బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జనలు చాలా చిన్నవే అని అనిపించేట్టుగా చెయ్యగలిగాం! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles