Rtc union announced strike from 27th january

APSRTC Union strike, rtc stricke form 27 January, APSRTC, EU, TMU Unions,

APSRTC Union Announced Strike From 27th January.

ఈనెల 27నుండి బస్సులకు బ్రేకులు

Posted: 01/17/2014 07:40 PM IST
Rtc union announced strike from 27th january

ఈ విషయం పై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యంతో అనేక సార్లు చర్చలు జరిపినా దీని పై స్పష్టత ఇవ్వడం లేదు. నేడు కూడా యాజమాన్యంతో ఈయూ, టీఎంయూ సంఘాలు చర్చలు జరిపాయి. ఈ చర్చలు విఫలం కావడంతో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు పిలుపు నివ్వడమే కాకుండా ఏ ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదని హెచ్చరించాయి. కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతిపై ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించని కారణంగా తాము సమ్మెకు సమాయత్తమవుతున్నట్లు తెలిపాయి. కార్మికలకు వెంటనే 46 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. కాని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఉండటం పై మండి పడుతున్నారు. కార్మిక సంఘాలు పెట్టిన డెడ్ లైన్ లోపు వీరి సమస్యల పై ఆర్టీసీ యాజమాన్యం స్పందిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles