Stop media from covering swantanter kumar appeals

Retired Judge Swantanter Kumar, Sexual assault Swantarter Kumar, Sexual assualt law intern, Supreme court notices to Retired judge

stop media from covering- Swantanter Kumar appeals

మీడియాను నిలువరించండి- సుప్రీం న్యాయమూర్తి అభ్యర్థన

Posted: 01/16/2014 09:10 AM IST
Stop media from covering swantanter kumar appeals

విశ్రాంత న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ మీద లైంగిక వేధింపుల కేసుని నమోదు చేసిన న్యాయ విద్యార్థిని పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు ఆ విషయంలో ఫిబ్రవరి 14 లోపు వివరణను ఇవ్వవలసిందిగా ఆ న్యాయమూర్తికి నోటీసులు జారీ చేసింది. 

ఆమె వేసిన పిటిషన్ మీద మొదట రిటైరైన సుప్రీం కోర్టు జడ్జ్ మీద కేసు తీసుకోవటానకి డిసెంబర్ 5 న నిరాకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం మీద సవాలు చేసిన ఆమె కేసుని చివరకు స్వీకరించిన సుప్రీం కోర్టు జనవరి 15 న దాని మీద విచారణకు చేపట్టటానికి సిద్ధమైంది. 

న్యాయ విద్యార్ధిని తన ఆరోపణలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ తన కుడిచేతిని ఆమె చుట్టూ వేసి ఆమె కుడి భుజం మీద ముద్దు పెట్టుకున్నారని దానితో అలజడి చెంది అక్కడి నుండి వెళ్ళిపోయానంటూ అఫిడవిట్ ద్వారా తెలియచేసారు.  విద్యార్ధినిగా తను చేసిన ఒక తప్పుని సరిదిద్దుకోవటానికి ఆయన ఆఫీస్ గదికి పోయినప్పుడు ఏం ఫరవాలేదు ఇలా రమ్మంటూ దగ్గరకు పిలిచి స్వతంత్ర కుమార్ ఆ విధంగా ప్రవర్తించారంటూ చెప్పారావిడ.  అంతకు ముందు కూడా ఒక సందర్భంలో స్వతంత్ర కుమార్ తన నడుం కింది భాగంలో చెయివేసారని పేర్కన్నారు తన అఫిడవిట్ లో. 

అయితే ఇదంతా తన మీద జరుగుతున్న కుట్ర అని కొట్టి పారేసిన స్వతంత్ర కుమార్ ఈ వివాదం మీద మీడియాలో వార్తలు రాకుండా నిషేధాజ్ఞలు జారీచెయ్యాలంటూ సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles