Hand of god a dying star

hand of God a dying star, NASA, NuStar, Powerful X rays, Milky way, Universe beyond Milky way, Spirituality and Science

hand of God a dying star

దైవహస్తం గా అస్తమిస్తున్న నక్షత్రం

Posted: 01/11/2014 12:14 PM IST
Hand of god a dying star

జూన్ 2012 లో నాసా ప్రయోగించిన న్యూస్టార్ అనే రోదసీ నౌక అస్తమిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీసి భూమ్మీది శాస్త్రజ్ఞులకు పంపించింది.  అది ఒక హస్తం ఆకారంలో రంగులీనివుండటంతో దాన్ని దైవహస్తం (హాండ్ ఆఫ్ గాడ్) అని అభివర్ణించారు. 

న్యూస్టార్ ని నక్షత్రాలు, పాల పుంత, శక్తివంతమైన ఎక్స్ రే ల విషయంలో అధ్యయనం కోసం అంతరిక్షంలోకి పంపించింది అమెరికన్ నాసా సంస్థ.  నశిస్తున్న నక్షత్రాలు, పాలపుంతకు కూడా ఆవల వున్న ఇతర పదార్థాలను శోధించటానికి పంపించిన ఈ రోదసీ నౌక మండిపోయి అంతరిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీయగా అది రంగులు చిమ్ముతూ ఒక చేతి ఆకారంలో కనిపించింది. 

నశిస్తూ విచ్ఛిన్నమవుతున్న ఈ నక్షత్రం (పల్సర్) ఇంకా గిరగిరా తిరుగుతూనేవుంది.  ప్రస్తుతం కేవలం 19 కి.మీ ల వ్యాసంలో మిగిలివున్న ఈ పల్సర్ సెకండ్ కి ఏడు సార్లు తనచుట్టూ తాను తిరుగుతోంది.  దీనినుంచి విడిపోయిన ముక్కలు ఎక్స్ రే లతో సంయోగం చెంది మండుతున్నాయి. 

చేతి ఆకారంలో కనిపిస్తున్న మండుతున్న పదార్ధపు భాగాలు ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన రీతిలో కలుస్తుండటం వలన అలాంటి ఆకారంలో కనిపిస్తోందా లేకపోతే అవి ఉండటమే ఆ ఆకారంలో ఉన్నాయా అన్నది ఇంకా శోధించవలసివుంది. 

అయితే ఎంత విజ్ఞానంలో అభివృద్ధి చెందినా, శాస్త్రజ్ఞులెప్పుడూ దైవం లేడని అనలేదు.  మనకు తెలియని శక్తి ఏదో ఈ విశ్వాన్నంతటినీ నడిపిస్తోందని శాస్త్రజ్ఞలు అంగీకరిస్తారు.  అందుకే పేర్లు కూడా హాండ్ ఆఫ్ గాడ్, ఇలాంటివి పెడుతుంటారు.  విశ్వంలోని గ్రహ, ఉపగ్రహ ఇంకా ఇతర పదార్థాలను సెలస్టియల్ బాడీస్ అంటారు. 

ఎటొచ్చీ సగం సగం జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే అంతా మానవుని మేధస్సే కానీ దేవుడు అనేవాడెవడూ లేడు అని అంటారు.  అయితే మనిషికి ఆ మేధస్సు మాత్రం ఎవరిచ్చారు అని అడుగుతారు ఆద్యాత్మికవాదులు. 

అందుకే, తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత అని ఇటు ఆధ్యాత్మిక వాదులు, విజ్ఞాన శాస్త్రంలో బాగా ముందుకెళ్ళిన శాస్త్రవేత్తలు కూడా అంటారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles