Aap wins trust vote

Aam Aadmi Party, AAP, Arvind Kejriwal, Congress, Delhi Assembly, Delhi government, Delhi trust vote, Manish Sisodia, Najeeb Jung, Rakhi Birla

Arvind Kejriwal, chief minister of Delhi, has won a crucial trust vote in the state legislature, demonstrating that he has the support of 38 of Delhi 70 legislators, a clear majority.

ఆప్ పార్టీ విశ్వాస పరీక్షలో నెగ్గింది

Posted: 01/02/2014 09:38 PM IST
Aap wins trust vote

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేకపోయినా బయటి నుండి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ నేడు  అసెంబ్లీలో తల పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది.

అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అమ్ఆద్మీపార్టీకి 28 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు 8 స్థానాలు వచ్చాయి. బిజెపి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు పలికారు.

ఓటింగుకు ముందు ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ నాటి విశ్వాస పరీక్షలో నెగ్గుతామా, లేదా అన్నది తమకు ముఖ్యమైన అంశం కాదని, ఇది సామాన్యుని ప్రభుత్వం అనీ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆరు నెలల వరకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ ఆరు నెలల్లో ఏఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles