Trs leaders comment on chandrababu son lokesh

chandrababu, nara lokesh, trs party, trs leaders comment on chandrababu, tdp vs trs, tdp chief chandrababu naidu, trs president k chandrasekhar rao, nara lokesh tweets about trs, twitter lokesh babu, political news, latest telugu news, breaking news, headlines

trs leaders comment on chandrababu son lokesh

బాబు ‘కొడుకు లోకేష్’ పై నేతల దాడి?

Posted: 12/14/2013 05:39 PM IST
Trs leaders comment on chandrababu son lokesh

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు ఈ మద్య కాలంలో పొలిటికల్ నాయకుల మీద కామెంట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్విట్టర్ బాబు గా అందరికి పరిచయం అయ్యాడు. రీసెంట్ గా టిడిపి , టీఆర్ఎస్ నాయకుల మద్య మాటల యుద్దం జరుగుతుంది. చంద్రబాబు వర్సెస్ చంద్రశేఖరరావు అనే విధంగా రాజకీయ విమర్శల దాడి నడుస్తుంది. విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్‌లో పడుకునే ఉన్నారని లోకేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించటమే కాకుండా, ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ విమర్శలు చేశారు.

 

అయితే ఈరోజు రాజకీయ నాయకులు బాబు తనయుడు పై విమర్శల దాడి చేయడం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు ఏం చేయాలో కూడా చెప్పాలన్నారు. ప్రధానమంత్రి హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు పేర్కొన్నారు. టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆమోస్, యాదవరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యేలను కొనే అవసరం ఎవరికుందని సూటిగా ప్రశ్నించారు.

 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సత్యం రామలింగరాజు పెంపుడు కొడుకు లోకేష్ అని.... ఆయన డబ్బులతోనే చిన్నబాబు విదేశాల్లో చదివాడని ఆపార్టీ ఆరోపించింది. లోకేష్...'ట్విట్టర్‌కి ఎక్కువ...రాజకీయాలకు తక్కువ' అంటూ టీఆర్ఎస్ ఎద్దేవా చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles