Salt rs 150 200 a kg in bihar

Bihar , Bihar government, Patna , salt shortage , Shyam Razak , Bharatiya Janata Party

Believe it or not, salt was selling at an exorbitant Rs.150 per kg in parts of Bihar amid rumours of an acute shortage of the essential ingredient of food

చుక్కలనంటిన ఉప్పు ధర – 150 కిలో

Posted: 11/15/2013 09:25 AM IST
Salt rs 150 200 a kg in bihar

ఉప్పు రేటు కిలోకు మహా అయితే ఎంత ఉంటుంది 15 నుండి 20 రూపాయాలు ఉంటుంది. కానీ అన్ని ధరలు పెరిగినట్లే ఉప్పు రేటు కూడా అమాంతం పెరిగి 150 రూపాయాలు అయింది. ఈ రేటు మన రాష్ట్రంలో కాదులెండి. బీహార్ లో.

రెండు రాజకీయ పార్టీల మధ్యమైరమే ఈ ఉప్పు రేటు పెరగడానికి కారణం అయ్యాయి. బీజేపీ, జేడీయూ మధ్య రాజకీయ వైరం కారణంగా బీజేపీ గుజరాత్ నుండి ఉప్పు సరఫరా చేయడానికి నిరాకరించిందని జేడీయూ ప్రచారం చేసింది. దీంతో దళారులు ఉప్పు నిల్వలను బ్లాక్ చేసి అమాంతం రేట్లు పెంచేశారు. దీంతో మరింత రేటు పెరుగుతుందని భావించిన సామాన్యులు ఉప్పును కావాల్సినంత కొనుగోలు చేసి పెట్టుకున్నారు. అక్కడి రాజకీయ పార్టీల ప్రచారంతో .టన్నుల కొద్ది ఉప్పు ఒక్క రోజునే అమ్ముడై పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం బీహార్ లో రాష్ట్రంలో కిలో ఉప్పు రూ.75 నుండి రూ.150 పలుకుతోంది. దర్పంగా, సీతామరి, సమస్తిపూర్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉప్పు రేట్లు చుక్కలనంటాయి. వీరి రాజకీయ వైరం ఉంటే ఉండవచ్చు కాని ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా ? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే స్థానికంగా ఉండే బీజేపీ నేతలే ఇలా ప్రచారం చేశారని పోలీసులు అంటున్నారు. ఏమైనా ఉప్పు 150 రూపాయలు అవ్వడం విడ్డూరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles