Governor accept minister vishwaroop region

Governor accept Minister Vishwaroop region. congress minister vishwaroop region accept

Governor accept Minister Vishwaroop region. congress minister vishwaroop region accept

కాంగ్రెస్ మంత్రి వికెట్ పడింది

Posted: 09/28/2013 08:47 PM IST
Governor accept minister vishwaroop region

    సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నాయకులు రాజీనామా బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు సమర్పించినా ఆవేశంతో తీసుకున్న నిర్ణయంగా బావించి చట్టసభల్లో అవి ఆమోదం పొందటం లేదు. కానీ నేడు కాంగ్రెస్ కి చెందిన మొదటి వికెట్ పడింది. కాంగ్రెస్ మంత్రి పినిపె విశ్వరూప్ సీమాంధ్ర కోసం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి నిరసనగా, ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామా చేసిన ఆయన ముఖ్యమంత్రి తీరు పై గతంలో విమర్శలు చేశారు.

    ఈయన తన రాజీనామాను ఆమోదించాలంటూ నేరుగా గవర్నర్ ని కలిశాడు. గవర్నర్ నేడు ముఖ్యమంత్రి  కిరణ్ తో మాట్లాడి రాజీనామాను ఆమోదించాడు. దీంతో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కోసం పడిన మొదటి వికెట్టు అయింది. ముఖ్యమంత్రి  తను హీరో అవుతూ, మంత్రులను జీరోలను చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే కిరణ్ ని విమర్శించినందుకే ఆయన రాజీనామాను ఆమోదించారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles