Digvijay singh attack in modi

digvijay singh attack in modi, Congress leader Digvijaya Singh, Digvijay Singh and Modi Comments attack in Twitter, Narendra Modi

digvijay singh attack in modi, Digvijay Singh and Modi Comments attack in Twitter

చిరుత తన రూపాన్ని మార్చుకుంటుందా? ఢిగ్గీ

Posted: 09/23/2013 11:00 AM IST
Digvijay singh attack in modi

చిరుత అంటే .. కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు నటించిన చిరుత సినిమా కాదులేండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ని ముద్దుగా పిలుచుకున్నారు. గుజరాత్ రాష్ట్రాభివృద్ధిపై ఫేక్(దొంగ)లెక్కలు చెబుతూ 'ఫేకూ మోదీ'గా పేరుపొందారని, గుజరాత్ అభివృద్ధిపై చర్చించేందుకు మోదీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐలతో మోదీ జరిపిన వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్ ట్విట్టర్‌లో మోదీపై విమర్శలకు దిగారు. మోదీ చెప్పే అభివృద్ధి రాజకీయం వినడానికి బాగానే ఉంది, కానీ చిరుత తన సహజరూపాన్ని మార్చుకోగలదా? అని ఆయన ప్రశ్నించారు. 'కాంగ్రెస్ ప్రజల్ని అభివృద్ధి చేస్తుంది.. మోదీ స్వీయవృద్ధి సాధిస్తారు', 'మోదీ దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేస్తారు.. కాంగ్రెస్ దేశాన్ని ఆకలి నుంచి విముక్తి చేస్తుంది' ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలని దిగ్విజయ్ సూచించారు. యూపీఏ తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిందని స్పష్టం చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles