Tngo leaders warn apngos

tngo leaders warn apngos, APNGO public meeting, Save Andhra Pradesh public meet, Telangana leaders, Telangana JAC, Prof Kodandaram

tngo leaders warn apngos

ఎపి ఎన్జీవో సంఘ నాయకులకు హెచ్చరికలు

Posted: 09/05/2013 03:53 PM IST
Tngo leaders warn apngos

తెలంగాణా ఉద్యమ కారుల ర్యాలీలను అనుమతించకపోవటం కన్నా 7 న సమైక్యాంధ్ర సభకు అనుమతించటమే తెలంగాణా నేతలకు ఎక్కువ బాధ కలిగిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు

సభ పేరుతో ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్ నగరాన్ని అల్లకల్లోలం చెయ్యవద్దని, ఖబర్దార్ బుద్ది చెప్తాం అని తెలంగాణా ఎన్జీవో నాయకులు హెచ్చరికలు చేసారు.    దానితో పాటే ఉద్యోగులను, రాజకీయ నాయకులను కూడా హెచ్చరించారు.  ఉద్యోగులను అనవసరంగా ఉద్యమాలలో బలికావద్దని, సీమాంధ్రుల ప్రభుత్వంలో తెలంగాణా నాయకులకు చోటు లేదని స్పష్టంగా తెలుస్తున్నదని అన్నారు. 

శాంతి ర్యాలీకి పోలిస్ అనుమతైతే లభించలేదు కానీ అడ్డంకులెన్ని వచ్చినా ర్యాలీ చేసి తీరుతామని తెలంగాణా రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నారు.  వరంగల్ లో ఈ విషయం మీద మాట్లాడిన కోదండరామ్, ఈ రోజు సాయంత్రానికల్లా కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.  సీమాంధ్ర నేతలు నీటి సమస్యను భూతద్దంలో చూపించి ప్రజలను రెచ్చగొట్టటం మానుకోవాలని ఆయన హితవు పలికారు. దానితో పాటే తెలంగాణా నేతలు ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అమలులోకి వచ్చేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళని హెచ్చరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles