Jaganmohan reddy back to chanchalguda jail from nims

Jaganmohan Reddy Imprisonment, Jaganmohan Reddy Hunger Strike, Jaganmohan Reddy, Chanchalguda jail, Andhra Pradesh, Chanchalguda, Central Prison, Congress, Hyderabad, Jagan Mohan Reddy, Osmania General Hospital,

agan was admitted to NIMS on August 30 following his hunger strike ... was shifted back to Chanchalguda jail here on Wednesday evening.

జగన్ మళ్లీ జైలుకెళ్లాడు

Posted: 09/05/2013 08:17 AM IST
Jaganmohan reddy back to chanchalguda jail from nims

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో చంచల్ గూడ జైలులో ఖైదీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గత నెల 25 వ తేదీన చంచల్ గూడ జైలులో నిరహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు రోజులు జైల్లోనే దీక్ష చేసిన జగన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఆగష్టు 29వ తేదీన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆ తరువాత నిమ్స్ కి తరలించి అక్కడ దీక్షను భగ్నం చేసి జగన్ కి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆ రోజు నుండి నిన్నటి వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న జగన్ స్వేచ్చా వాయువులను వదిలి మళ్ళీ కారాగారంలోకి వెళ్లిపోయారు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జగన్ ని నిమ్స్ నుండి డిచ్చార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జగన్ పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేయచ్చునని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంచల్‌గూడ జైలు అధికారుల తెలియజేయడంతో  బుధవారం రాత్రి ఆయన్ను జైలు అధికారులు చంచల్ గూడకు తరలించారు. గత వారం రోజుల నుండి స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న జగన్ నేటి నుండి జైలు గోడల మధ్య గడపనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles