Samaikyandhra leaders arrest at alipiri

Samaikyandhra leaders arrest at Alipiri, V Hanumantha Rao, Congress Rajyasabha Member VH, Attempted attack on VH, Tirupati Alipiri, Samaikyandra Parirakshana Samiti, Rayalaseema Youth Force

Samaikyandhra leaders arrest at Alipiri

అలిపిరి దగ్గర ఉద్రిక్తత

Posted: 08/18/2013 11:02 AM IST
Samaikyandhra leaders arrest at alipiri

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మీద దాడికి పాల్పడ్డారనే ఆరోపణతో అలిపిరి పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసారు.  అందులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయుకులు బాల సుబ్రహ్మణ్యం, రాజారెడ్డిలున్నారు. 

పోలీసుల చర్యలను నిరసిస్తూ ఈ రోజు అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు నిరసన ప్రదర్శనలు చేసారు.  నిరసనలలో ఎంపి శివప్రసాద్ కూడా పాల్గొనటం విశేషం.  పోలీసుల జులం మీద గళమెత్తి నిరసనలు తెలియజేస్తున్న ఆందోళనకారులు హనుమంతరావుని అరెస్ట్ చెయ్యాలని కూడా కోరారు. 

నిన్న తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన హనుమంతరావుకి పూలగుచ్ఛాలతో తమ నిరసన తెలియజేద్దామని చాలా సేపు అలిపిరి దగ్గర ఆందోళనకారులు వేచి చూస్తుండగా ముందుగా తన కుటుంబ సభ్యులను తరలించిన విహెచ్ చాలా సేపటికి పోలీసు బందోబస్తు మధ్య అలిపిరి చేరుకున్నారు. అప్పుడు అక్కడ దాడికెలాంటి ప్రయత్నమూ జరగలేదని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని రాయలసీమ యూత్ ఫోర్స్ కన్వీనర్ సూర్యప్రకాశ్ అన్నారు. 

విహెచ్ మాటలకు ఆగ్రహంతో ఆయన కారు మీద చెప్పులు వేస్తేనే దాడి జరిగిందని, ఖండిస్తున్నామని అంటున్న తెలంగాణా వాదులు తాము భౌతికంగా చేసిన దాడులను మర్చిపోయారా అంటూ సూర్యప్రకాశ్ నాగం జనార్దన రెడ్డి మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన దాడి, పార్లమెంటు ఆవరణలోనే జయప్రకాశ్ నారాయణ మీద జరిగిన దాడి, ఇప్పడు రాద్ధాంతం చేస్తున్న తెరాస నాయకుడు హరీష్ రావు అప్పుడు ఢిల్లీ ఎపి గెస్ట్ హౌస్ లో దళిత ఉద్యోగి మీద చేసిన దాడి అలాంటి ఇంకా ఎన్నో దాడులు కావా, ఒకళ్ళిద్దరు చెప్పులు విసిరితే అది దాడా అది కూడా విహెచ్ కారు మీద అన్నారు సూర్యప్రకాశ్. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles