Trs mla harish rao support on kcr comments

trs mla harish rao

trs mla harish rao support on kcr comments

మా మామ వ్యాఖ్యలను వక్రీకరించారు: హరీష్

Posted: 08/03/2013 01:48 PM IST
Trs mla harish rao support on kcr comments

ఆంద్ర ఉద్యోగులు తెలంగాణ నుండి వెళ్లిపోవాలి అని కేసిఆర్ ఇచ్చిన పిలుపుకు సీమంద్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే తెలంగాణ నాయకులు కూడా కేసిఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేసిఆర్ (మామ)కు మేనల్లుడు హరిశ్ రావు సపోర్టు వచ్చారు. మామ మాటలను మీడియా వక్రీకరించిందని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. కెసిఆర్ (మామ) సహజసిద్ధమైన ప్రక్రియనే చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలి, దానికి అక్కడ ఉద్యోగులు కావాలి, అనుభవం ఉన్నవారు అక్కడికి వెళ్లిపోతే తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని కెసిఆర్ చెప్పినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఎస్సార్సీలో చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని ఎన్టీరామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పారని, అందులో కొత్త విషయమేమీ లేదని, సంచలనం సృష్టించే అంశం ఎంత మాత్రమూ లేదని ఆయన అన్నారు. కెసిఆర్ (మామ) వ్యాఖ్యల్లో ఉద్దేశ్యాలు గానీ దురుద్దేశ్యాలు గానీ లేవని ఆయన అన్నారు. ఏదో అయిపోయిందని బురద జల్లే కార్యక్రమం చేపట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవడమే కాదు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడికి రావాలని కూడా కెసిఆర్ అన్నట్లు ఆయన తెలిపారు. మామ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే .. మేనల్లుడు ఆ వ్యాఖ్యలకు ఆయిల్ మెంట్ పూస్తున్నాడని సీమాంద్ర నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles