Minister vishwaroop son krishna reddy arrest

Minister Vishwaroop son krishna Reddy arrest, Case filed on Minister Vishwaroop son, Minister Vishwaroop son krishna Reddy in real estate case, Case filed on Minister son, SR Nagar police station.

మంత్రి కుమారుడి వీరంగం... అరెస్ట్

Posted: 07/25/2013 09:02 AM IST
Minister vishwaroop son krishna reddy arrest

రాజకీయ నాయకుల కుమారుల ఆగడాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయవచ్చేనే భావన వారిలో ఉందో లేక ఇలాంటి సంఘటనలు చేస్తే పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నారో ఏమో. గతంలో చాలా మంత్రి సుపుత్రులు దౌర్జన్యాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మన రాష్ట్రమంత్రి విశ్వరూప్ కుమారుడు క్రిష్ణారెడ్డి రాఘవులు అనే వ్యాపారి పై దాడి చేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అతనితో పాటు క్రిష్ణారెడ్డి మామ, మంత్రి బావమరిది సాంబమూర్తి పై కూడా కేసు నమోదు చేశారు. వీరిద్దరిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నాడు. సాంబమూర్తి, రాఘవులు కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. అందులో విభేదాలు తలెత్తడంతో తన బావ అండతో అల్లుడు క్రిష్ణారెడ్డితో కలిసి అతని పై దాడి చేసినట్లు తెలుస్తుంది. గతంలో క్రిష్ణారెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికితే వారి పై చిర్రుబుర్రు లాడి తన తండ్రి మినిస్టర్ అని చెప్పి వార్తల్లోకెక్కిన సందర్భాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles