Sun god kalyanam at arasavalli

Sun God Kalyanam, Arasavalli sun God, Arasavalli Srikakulam district, Toli Ekadashi, Arasavalli Suryanarayana Swamy

Sun God Kalyanam at Arasavalli

అరసవెల్లి సూర్యదేవుని కళ్యాణం

Posted: 07/19/2013 12:34 PM IST
Sun god kalyanam at arasavalli

తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని అరసవెల్లిలో అతి వైభవంగా జరిపారు. 

ఈ సందర్భంగా వందమంతి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రాచీనమైనది, ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నది.  సంవత్సరానికి రెండు సందర్భాల్లో సూర్యకిరణాలు స్వామి మూల విగ్రహాల మీద ప్రసరిస్తాయి.  మిగిలిన ఆలయాల్లో ఉత్సవ విగ్రహాల మీద కూడా సూర్యరశ్మిని పడనివ్వరు.  అందుకే ఛత్రచామరాలతో ఊరేగింపు ఉత్సావాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ స్వామి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే కాబట్టి అది ధర్మవిరుద్ధం కాదు. 

ఈరోజు సూర్యదేవుని ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించటానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles