Conditional permission for amma hastam

Amma hastam conditional permission, AP Panchayat elections 2013, Kiran kumar reddy, Sridhara Babu, Navin Mittal, Chief Minister of AP, AP Civil Supplies Minister, Election Commission, Panchayat elections

conditional permission for amma hastam

అమ్మహస్తానికి షరతులతో ఆమోదం

Posted: 07/15/2013 12:06 PM IST
Conditional permission for amma hastam

అమ్మహస్తం కార్యక్రమం అమలుకి ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన ఆమోదాన్ని తెలియజేసింది.

అమ్మహస్తంలో పంపిణీ చేసే నిత్యావసర వస్తువులను ఇచ్చే కవర్ మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పౌరసరఫరాల శాఖామాత్యులు శ్రీధరబాబు ఫొటోలు ముద్రించి ఉండటం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యంతరాలకు దారితీసింది.

ఆ పథకాన్ని నిలిపివేస్తే పేదలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కోరుతూ, నిత్యావసరాలను అందజేసే కవర్ల మీదున్న ఫొటోలు కనపడకుండా స్టిక్కర్లు అంటిస్తామని హామీ ఇచ్చింది.  దానితో ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ ఆ షరతు మీద అంగీకరిస్తూ ఆదివారం సాయంత్రం అమ్మహస్తాన్ని ఆ విధంగా కొనసాగించివచ్చునని ప్రకటించారు. 

ఉత్తర ప్రదేశ్ లో మాయావతి, ఎన్నికల గుర్తైన ఏనుగు విగ్రహాల మీద ప్రభుత్వ ఖర్చుతో ముసుగులు వేసినట్లుగా అమ్మహస్తం కవర్ల మీద స్టిక్కర్లు వేసి ప్రస్తుతానికి నడిపించటానికి ప్రభుత్వం సిద్ధమైంది.  ఆ హామీ మీద ఎన్నికల కమిషన్ నిన్న పచ్చజెండా చూపించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles