Errabelli dayakar rao comment on trs party

errabelli dayakar rao comment on trs party, tdp leader errabelli dayakar rao, tdp, trs party, kcr, ktr, telangana issue, telangana state, congress party, ktr fire on tdp, errabelli fire on trs pary

errabelli dayakar rao comment on trs party

తెరాస కనుమరుగవుతుంది: తెలంగాణ నాయకుడు

Posted: 07/06/2013 12:57 PM IST
Errabelli dayakar rao comment on trs party

 

టిఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది. కేసిఆర్ కు ఇంటి నుండే వ్యతిరేకత రావటం, పార్టీపై అవినీతి మరకలు పడటం, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారని తెలంగాణఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగవడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కెసిఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసి పోవటం ఖాయమని దయాకర్ చెబుతున్నారు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ రీసెంట్ గా మాట్లాడిన విధానమే నిదర్శనం అని దయాకర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles