Minister kavuri sambasiva rao relieved of cwc post

Textiles Minister Kavuri Sambasiva Rao , Minister Kavuri Sambasiva Rao relieved of CWC post, Home Minister Sushil Kumar Shinde, Congress Working Committee,

Minister Kavuri Sambasiva Rao relieved of CWC post

కావూరి రాజీనామా... ఆ స్థానంలో షిండే ?

Posted: 06/28/2013 12:23 PM IST
Minister kavuri sambasiva rao relieved of cwc post

కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు రాజీనామా అంటే.. మరోల అనుకోకండి.. కావూరి రాజీనామా చేసింది.. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యత్వాన్ని వదులుకున్నారు. మంత్రిగా చేరినందున తనను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుని బాధ్యతల నుంచి తప్పించాలన్న ఆయన అభ్యర్థనను సోనియాగాంధీ ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. కావూరి ఖాళీని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు కూడా అయిన కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భర్తీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ మరో ప్రకటనలో తెలిపింది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కావూరికి సీడబ్ల్యూసీలో, ఆ మర్నాడే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం తెలిసిందే. ఒకరికి ఒకే పదవి అన్న రాహుల్‌గాంధీ ఫార్ములాకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సభ్యత్వాన్ని వదులుకోవాలని కావూరి సాంబశివరావు నిర్ణయించుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles