Sonia gandhi clarity on telangana issue

sonia gandhi clarity on telangana issue, congress party, andhrapradesh, telangana issue, telangana state,

sonia gandhi clarity on telangana issue

విభజనకు సోనియా గాంధీ నిర్ణయం?

Posted: 06/27/2013 08:34 PM IST
Sonia gandhi clarity on telangana issue

తెలంగాణ రాష్ట్ర విభజనకు కాంగ్రెసుఅధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడుతున్న తీరు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. విభజన ఎలా చేయాలనే ఆలోచన మాత్రమే సాగుతోందని అంటున్నారు. రాయల తెలంగాణ అనే ప్రతిపాదన ఉన్నట్లు ఎక్కువగా ప్రచారం సాగుతోంది. ఆ దిశలో ఆలోచన సాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అది ఆలోచన మాత్రమేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అనడాన్ని బట్టి ఆ ఆలోచన సాగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారనే ప్రచారాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తోసిపుచ్చుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మధుయాష్కీ వంటి నేతలు ఆ మాటను నిర్ద్వంద్వంగానే తోసిపుచ్చుతున్నారు. తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles