Cbi completes investigation on 3 chargeseets

Jagan case, CBI probe, Jagan disproportionate assets case, CBI submits memo on Jagan, assets case, jd arunachalam, mopidevi venkataramana, sabhitha indra reddy, ex minister, Bharathi cement,

cbi-completes investigation on 3 chargeseets

జగన్ కేసులలో దర్యాప్తు పూర్తిచేసిన సిబిఐ

Posted: 06/21/2013 12:29 PM IST
Cbi completes investigation on 3 chargeseets

వైయస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ ఫైలు చేసిన ఐదు ఛార్జ్ షీట్లలో మూడు- హెటరో డ్రగ్స్, జగతి పబ్లికేషన్స్, రామ్కీ సంస్థల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల విషయంలో ఆరా తీయటం పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసింది.  

సిబిఐ డిఐజి వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ దర్యాప్తు పూర్తయిందని, ఇక ఆ కేసుల్లో దర్యాప్తు చేసేదేమీ మిగలలేదని మూడు ఛార్జ్ షీట్ల (CC 8/12, CC 9/12, CC 10/12) విషయంలోనూ విడివిడిగా కోర్టుకి నివేదికను సమర్పించారు.  దీనితో ఆయా కేసుల మీద న్యాయస్థానంలో విచారణ కొనసాగించటానికి అవకాశం ఏర్పడింది.  

ఇక వాన్ పిక్, దాల్మయా సిమెంట్ల మీది ఛార్జ్ షీట్లు మిగిలాయి.  ఈ కేసుల్లో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబిత ఇంద్రారెడ్డి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు.  ఈ రెండు కేసుల్లోనూ సిబిఐ ఇంకా సప్లిమెంటరీ ఛార్జి షీట్లను సమర్పించనుంది.  అందువలన వీటి దర్యాప్తు ఇంకా పూర్తయినట్టు కాదు.  

అయితే ఇంకా జగన్ కేసు అంత త్వరగా పూర్తయ్యేట్టుగా లేదు. ఇంకా ఛార్జ్ షీట్లు సమర్పించని కేసులు ఇవి- పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, కోల్ కతా సూట్ కేస్ కంపెనీ, ఇందు ప్రాజెక్ట, లేపాక్షి ప్రాజెక్ట్.  వీటి మీద ఛార్జ్ షీట్ వెయ్యటం, వాటి మీద దర్యాప్తు చెయ్యటం పూర్తి చేస్తే అవి కూడా కోర్టు విచారణకు సిద్ధమవుతాయి.  

ఈ లెక్కన వైయస్ జగన్ అనుయాయులు, అనుచరులు, వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములు ఇప్పుడప్పుడే బయటపడేట్టుగా లేరు.  ఎన్నికల సమయానికి ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సిందే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles