Political julakanti ranga reddy demand telangana bill in assembly

julakanti ranga reddy, cpi leader julakanti ranga reddy, ap assembly, bjp leader nagam janardhan reddy, andhra pradesh assembly, telangana issue, assembly speaker, tdp, political parties bayyaram mains

julakanti ranga reddy demand telangana bill in assembly

అసంతృప్తి ? గందరగోళం..?

Posted: 06/11/2013 12:09 PM IST
Political julakanti ranga reddy demand telangana bill in assembly

శాసనసభలో విపక్షాలు దుమారం రేపాయి. విపక్షాలు సభలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అంగన్ వాడీ కార్మికులు, సహాయకుల వేతనాల పెంపుపై చర్చించాలని కోరుతూ సిపిఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెటాటరు. అదేవిధంగా బయ్యారం గనులపై చర్చించాలని, టిడిపి, విద్యుత్ ఛార్జీల పెరుగుదుల, ఇంధన సర్దుబాటు ఛార్జీలపై ఎంఐఎం, స్థానిక ఎన్నికలపై రిజర్వేషన్లపై వైసిపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీ తీర్మానం కోరుతూ టిఆర్ఎస్, సిపిఐ, బిజెపి, హరీశ్వర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే.. ఇవన్నీ చదివిన స్పీకర్.. వీటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా తీర్మానాలపై ఎలాంటి చర్చా చేపట్టకుండానే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్షాలు.. వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles