Jiah khan died due to hanging preliminary post mortem report

jiah khan died, jiah khan post-mortem report, preliminary post-mortem report, bollywood actress jiah khan, actress died due to hanging

Jiah Khan died due to hanging-Preliminary post-mortem report

పోస్టుమార్టం రిపోర్టులో బయటపడిన నిజం

Posted: 06/05/2013 03:37 PM IST
Jiah khan died due to hanging preliminary post mortem report

ఇప్పుడు అందరు ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ నటి ఆత్మహత్య చేసుకున్న తీరు పై అనేక అనుమానాలు వస్తున్నాయి. 25 సంవత్సరాల వయసుగల బాలీవుడ్ నటి జియా ఖాన్ సోమవారం అర్ధరాత్రి ముంబై జుహులోని సంగీత్ సాగర్ అపార్టు మెంటులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జియాఖాన్ మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసారు. వైద్యలు వెల్లడించిన నివేదిక ప్రకారం ఆమె ఉరి వేసుకోవడం వల్లనే చనిపోయిందని, ఇది ఆత్మ హత్యే అని ధృవీకరణ అయింది. రాత్రి 11 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో ఆమె ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో జియా ఖాన్ మరణంపై నెలకొన్న అనుమానాలకు తెర పడినట్లయింది. బాలీవుడ్ అవకాశాలు లేక పోవడంతో పాటు, ప్రేమ వ్యవహారం విఫలం అవ్వడం కూడా ఆమెను కృంగ దీసినట్లు, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles