Telugu desamtdp kadiyam srihari party jump

tdp leaderkadiyam srihari, tdp kadiyam srihari party jump, telugu desam party, trs party, kcr, chanra babu naidu, kadiyam network change,

TDP Kadiyam Srihari Party Jump

కాలు జారిన కడియం..? ఆనందంలో కేసిఆర్ ?

Posted: 05/11/2013 12:14 PM IST
Telugu desamtdp kadiyam srihari party jump

రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు రాజకీయ పార్టీలు (సెల్ నెట్ వర్క్) రాజ్యమేలుతున్నాయి. . అన్నీ రాజకీయ పార్టీలు జంప్ జిలానీలకు రెడ్ కార్పేట్లు పరిచింది. ఇది గో.పిలకు మంచి అవకాశం. ఏపార్టీలో ఎక్కువ ఆఫర్లు ఇస్తుందో , ఆ పార్టీలోకి గోపిలు చేరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోను ఇన్ కాం కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ , మిస్సెడ్ కాల్స్ లపై రాజకీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడికి ఏ కాల్ అవసరమో గమనించి. ఆ నాయకులకు వలవేస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకులు.. ఏ రాజకీయ నాయకుడికి ఏ నెట్ వర్క్ అవసరమో గుర్తించి ఆ నెట్ వర్క్ లోకి లాగేసుకుంటున్నారు.. నిన్న దాడి, నేడు కడియం శ్రీహరి , తెలుగు దేశం పార్టీ నెట్ వర్క్ నుండి తొలిగిపోతున్నారు. . దాడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్ వర్క్ లోకి చేరిపోయాడు. టిడిపి సిమ్ ను తీసిపారేశాడు. ఇప్పుడు అదే బాటలో కడియం శ్రీహరి , టిడిపి సీమ్ తీసివేసి .. టిఆర్ఎస్ నెట్ వర్క్ లోకి చేరటానికి అప్లీకేషన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంత త్వరగా కాలు జారిన కడియం పై కేసిఆర్ అధిక ప్రేమ కురిపిస్తున్నాడని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కడియం రాక కోసం కేసిఆర్ ఆనందంతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కడియం శ్రీహరి టిడిపి సిమ్ ను ఎందుకు వదిలేస్తున్నాడో తెలుస్తోంది. ఈ మద్య కాలంలో చంద్రబాబు నుండి కడియం కు ఎలాంటి సిగ్నల్స్ రావటంలేదట.. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ పై బాబు ఎలాంటి సిగ్నల్స్ లేవని కడియం అంటున్నారు. తెలంగాణ కోసం .. టిడిపి ని వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెబుతున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కడియం రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు దేశం పార్టీ మత్రం తెలంగాణ వ్యతిరేకం కాదని చెబుతున్నాడు. కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం లో టిడిపి విఫలమవడంతో నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పటం జరిగింది. ఇంక టిడిపి ఇలా నెట్ వర్క్ మారే సిమ్ల్ ఎన్ని ఉన్నాయో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles