Nephew of railway minister p k bansal caught taking bribe

pk bansal nephew caught accepting bribe, cbi nabs bribe in railway works, pk bansal nephew sangla, kunar railway gm

nephew of railway minister p k bansal caught taking bribe

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రైల్వే మంత్ర మేనల్లుడు

Posted: 05/04/2013 09:56 AM IST
Nephew of railway minister p k bansal caught taking bribe

పూర్వకాలం సినిమాల్లో చూపించనట్లుగా టేబుల్ కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునేంత అమాయకత్వం ఎప్పుడో పోయింది.  చేతికి మట్టి అంటకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి మంత్రులు, అధికారులకు వాళ్ళకు నమ్మకస్తులు ఆ పనులు చేస్తుంటారు అని తెలుసు కాబట్టి సిబిఐ మాటు వేసి లంచం తీసుకుంటున్నవారిని రంగు చేతుల్తో పట్టుకుంది. 

సాక్షాత్తూ రైల్వే మంత్రి పి.కె.బన్సల్ మేనల్లుడు వి.సింగ్లాను మంజునాథ్ అనే వ్యక్తి నుంచి 90 లక్షల రూపాయలు తీసుకున్నందుకు చండీగఢ్ లో అరెస్ట్ చేసారు.  అతనికి ఈ పనుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంజునాథ్ ద్వారా, రైల్వేలో ఈమధ్యనే స్టాఫ్ మెంబర్ గా పదోన్నతిని పొంది, అంతకంటే ఎక్కువ రాబడి ఉండే ఎలక్ట్రికల్ మెంబర్ స్థానానికి బదిలీకి ప్రయత్నం చేస్తున్న కుమార్ కోసం చేతులు మారిన సొమ్మది.  కుమార్ ముంబైలో అరెస్ట్ అయ్యాడు.  అవినీతి నిరోధక చట్టంకింద సిబిఐ కేసును నమోదు చేసింది.

గత కొన్ని రోజులుగా సిబిఐ కుమార్ కదలికలను కనిపెడుతూ వస్తోంది.  అతని ఫోన్ కాల్స్ ని అనుసరిస్తూ నగదు చేతులు మారే సమయానికి పట్టుకున్న సిబిఐ, సింగ్లా, మంజునాథ్ లను అరెస్ట్ చేసి సిబిఐ కార్యాలయానికి తీసుకునివచ్చారు.  జనరల్ మేనేజర్ వెస్ట్రన్ రైల్వేస్ పనిచేస్తున్న కుమార్ ఉద్యోగ హోదా ప్రభుత్వ కార్యాలయంలో సెక్రటరీ హోదాతో సమానమైనది.  రైల్వే మంత్రి బన్సల్ దీనిమీద వ్యాఖ్యానించటానికి అందుబాటులో లేరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles