Railway advance booking time limit reduced to 60 days

railway booking only 60 days, indian railways, railway travel agents, individual commuters, railway summer rush

railway advance booking time limit reduced to 60 days

రైల్వే అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు 60 రోజుల వరకే

Posted: 05/01/2013 08:21 AM IST
Railway advance booking time limit reduced to 60 days

నిన్నటి వరకు అడ్వాన్స్ రైల్వే బుకింగ్ చేసుకోవటానికి ఉన్న 120 రోజులు ఈ రోజు నుంచి 60 రోజులకు కుదించబడింది.  వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు భారీగా బుకింగ్ లు చేసుకుంటూ సామాన్య ప్రయాణీకులకు టికెట్లు దొరకకుండా చేసే అవకాశం ఉండటంతో, దానికి చెక్ పెడుతూ రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రెల్ 30 లోపులో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నవారికి 120 రోజుల ముందుగా చేసుకునే వెసులుబాటు కలిగించారు కాబట్టి అప్పడు చేసుకున్న బుకింగ్ లలో మార్పు ఉండదు కానీ ఈ రోజు మే 1 నుంచి చేసుకునే అడ్వాన్స్ బుకింగ్ లకు మాత్రం 60 రోజుల వరకే వెసులుబాటు కల్పించటం జరిగింది.

వ్యాపారాన్ని పెంచుకోవటానికి లేని కొరతను కల్పించటం సామాన్యంగా చేసేదే కాబట్టి ఎక్కువ మొత్తంలో బుకింగ్ చేసి ఎక్కువ లాభాలను పొందుదామనుకునే ఏజెంట్ల ఆట కట్టించటానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  రైల్వే కౌంటర్లలో లభించని టికెట్లు ఏజెంట్ల ద్వారా లభిస్తాయనే ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తున్నందున అడ్వాన్స్ బుకింగ్ కాలాన్ని తగ్గించటం వలన కొంత తేడా వస్తుందని నమ్ముతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles