Nandamuri harikrishna clarifies ntr photo dispute

nandamuri harikrishna, n t ramarao, jr nt ramarao, ys sharmila, telugu desam party, ysr cong party

nandamuri harikrishna clarifies ntr photo dispute

రాజకీయ వ్యభిచారం కాదది

Posted: 04/09/2013 09:42 AM IST
Nandamuri harikrishna clarifies ntr photo dispute

హన్మకొండ వెయ్యి స్తంభాల గుడిలో దర్శనానికి వచ్చిన హరికృష్ణ కొద్దికాలంగా రగులుతున్న వైకాపా ఫ్లెక్సీలలో ఎన్టీ అర్ ఫోటోల విషయంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఫొటోని ఎవరైనా పెట్టుకోవచ్చని అన్నారు.  అలా ఏ పార్టీయైనా పెట్టుకున్నంత మాత్రాన అది రాజకీయ వ్యభిచారంలోకి రాదని ఆయన స్పష్టం చేసారు.  శ్రీకృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకున్న ఎన్టీఆర్ ఫొటోను తెలుగిళ్ళల్లో అందరూ పెట్టుకునేవారని ఆయన అన్నారు.  ఆయన ఫొటో పెట్టుకోవటమే దారిద్ర్యానికి సూచనైతే, మరి ఆ మహానుభావుడి ఫొటోని సంవత్సరాల క్రితమే తీసేసారుగా దానికేమనాలి అన్నారు హరికృష్ణ- చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ కార్యాలయాలలోంచి ఎన్టీ ఆర్ ఫొటోని తీసేసిన విషయాన్ని గుర్తుచేస్తూ. 

పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో రాజకీయాల ప్రసక్తి తేవద్దు అని వారిస్తూనే హరికృష్ణ తాను చెప్పదలచుకున్న విషయాలను స్పష్టంగా చెప్పేసారు. 

ఎవరో నా కొడుకు ఫొటోని పెట్టినట్లయితే దానికి నా కొడుకుదేం బాధ్యత అని ప్రశ్నించారాయన- వైకాపా తరఫున షర్మిల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టటం గురించి మాట్లాడుతూ.  నా కొడుక్కి దానితో ఏ సంబంధం లేదు.  మేము లోగడ చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం అని కూడా ఆయన అన్నారు. 

బాద్షా విజయయాత్రలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కూడా తను చెయ్యని పనులకు తనను బాధ్యుడుగా చేసి మాట్లాడటం తగదని అన్నారు.  తన తాత స్థాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని తన నరనరాల్లోనూ ఆ రక్తమే ప్రవహిస్తోందని, తాను ఆ పార్టీ లోనే ఉంటానని జూనియర్ కూడా స్పష్టం చేసారు.పైగా బాద్షా విజయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని, ఆ ఆనందాన్ని పాడుచెయ్యకండని ఆయన అర్థించారు. 

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles