Possiblie criminal activity acertainable

neuro imaging, anterior cingulate cortex, mind research network, national academy of sceinces

possiblie criminal activity ascertainable through neuro imaging

neuro-image.png

Posted: 03/30/2013 04:50 PM IST
Possiblie criminal activity acertainable

neuro-imaging

మనిషి ప్రవర్తనను భావోద్వేగాలను నియంత్రించే యాంటీరియర్ సింగ్యులేట్ కోర్టెక్స్ అనే మెదడు లోని భాగాన్ని న్యూరో ఇమేజింగ్ పద్ధతి ద్వారా ఫోటోలు తీసి దాని ద్వారా మనిషి నేర ప్రవృత్తిని కనిపెట్టవచ్చని న్యూ మెక్సికో అల్బుర్కాక్వే లోని మైండ్ రిసెర్చ్ నెట్ వర్క్ లో పరిశోధనలు చేసారు. దాని తాలూకూ పేపర్లను ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించవలసి వుంది.

ఖైదీలను విడుదల చేసేముందు వారిని ఈ పరీక్షణలతో నేర ప్రవృత్తి వారిలో తిరిగి వచ్చే అవకాశం ఉందేమో చూసే అవకాశం ఉంది. ఖైదీలలో యాంటీరియర్ సింగ్యులేట్ కోర్టెక్స్ లో మందికొడిగా ఉన్నవాళ్ళల్లో ఎక్కువగా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఈ పరిశీలన తెలియజేస్తోంది. మెదడులోని ఆ ప్రత్యేకమైన భాగంలో చురుగ్గా ఉన్నవారికంటే మందకొడిగా ఉన్నవారిలో రెట్టింపు నేర ప్రవృత్తి పైకి ఉబికే అవకాశం ఉందట.

దీనివలన నేరాల విషయంలో న్యాయపరంగా తీసుకునే శిక్షలలో తేడా ఉండటమే కాకుండా, మూలం ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి దానికి తగిన చికిత్స చేసి నేరస్తులలోని నేరప్రవృత్తిని తగ్గించే అవకాశం కూడా కలుగుతుందని భావిస్తున్నారు ఎమ్ఆర్ఎన్ డైరెక్టర్ కెంట్ ఏ కీహిల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akhilesh yadav blames congress using cbi as a tool
Crowded pointspng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles