All india motor transport corporation strike

motor transport in india, aimtc strike, loss due to strike to govt. insurance premium on transport vehicles, toll tax, diesel hike

all india motor transport congress strike call

trransport-strike.png

Posted: 03/27/2013 09:05 AM IST
All india motor transport corporation strike

truncks

ఏప్రిల్ 1 నుంచి 75 లక్షల లారీలను, 40 లక్షల బస్సులను రోడ్డు మీదకు రాకుండా దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్న అఖిల భారత రవాణా వాహన సంఘం (ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్).

పెరిగిన డీజిల్ ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియం ల మీద కేంద్ర రవాణా, జాతీయ రహదారి మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలు విఫలమవటం వలన మా వాహనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఏఐఎమ్ టిసి తెలియజేసింది.  

మార్చి 30 వ తారీఖు వరకూ సమయం ఉందని, అప్పటి లోపులో ప్రభుత్వం మా కోరికలను పరిశీలించి పరిష్కారానికి వస్తే సమ్మెను విరమించుకుంటాం లేదంటే ఏప్రిల్ 1 నుండి నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తామంటున్నారు ఏఐఎమ్ టిసి అధ్యక్షుడు బాల్ మల్కిత్ సింగ్.  ఈ సమ్మె వలన ప్రభుత్వానికి 2200 కోట్ల నష్టం వస్తుందని కూడా ఆయన అంచనా వేసి చెప్పారు.  

ఏఐఎమ్ టి సి ఉపాధ్యక్షుడు కుల్ తరణ్ సింగ్ ఆత్వాల్ మాట్లాడుతూ, మా కోరికలను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో మేము ఒక్క ఢిల్లీలోనే 20 లక్షల వరకూ రవాణా అనుమతులను ప్రభుత్వానికి సరెండర్ చెయ్యబోతున్నామన్నారు.  ప్రైవేటు రవాణా వ్యవస్థ ఎదుర్కుంటున్న సమస్యలు డీజిల్ పెరుగుదల, ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెరుగుదల, టోల్ టాక్స్ లు, దిగుమతి పన్ను.  వీటి కింది రవాణా నలిగిపోతోందని ఆత్వాల్ తన ఆవేదనను వ్యక్తం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two german mariners arrested on charge of hitting a fishing boadt
Dmdmdk members suspension tenure reduced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles