Restrictions to celebrate holi festival

holi festival, indian festivals, holi restrictions, holi in andhra pradesh, terrorists movement

restrictions to celebrate holi festival

holi.png

Posted: 03/26/2013 08:50 AM IST
Restrictions to celebrate holi festival

holi-celebrations

మనం దిగుమతి చేసుకున్నపండుగలలో హోలీ ఒకటి. దక్షిణ భారతంలో ఒకప్పుడు పెద్దగా ఆదరణకు నోచుకోని పండుగలలో ఒకటి వినాయక చవితి, రెండవది హోలీ. ఈ రెండిటినీ మన రాష్ట్రం ఉత్తరాది నుంచి అప్పు తెచ్చుకుంది. పండుగ చేసుకోవటంలో తప్పేమీ లేదు. అది ఎవరి పండుగ అని చూడాల్సిన అవసరం అసలే లేదు. అందుకే నూతన సంవత్సరాన్ని మనం ఉగాదికీ చేసుకుంటాం, జనవరి ఒకటో తేదీనా చేసుకుంటాం. కుల మతాలతో సంబంధం లేకుండా చేసుకునే వేడుకల్లోకి జన్మదిన వేడుకలు కూడా పాశ్చాత్య పోకడలను సంతరించుకున్నాయి. వివాహాది శుభకార్యాలలో భోజనాలు పెట్టే పద్ధతిలోనూ మార్పులు వచ్చాయి.

ఎల్లుండి జరుపుకునే హోలీ విషయానికొస్తే, ఒకప్పుడు వసంతోత్సవాలలో వసంతం చల్లుకునేవారు. అందులో కెమికల్స్ తో చేసిన రంగులుండేవి కావు. పైగా అది అక్కడి ఉత్సవంలో పాల్గొనేవారి వరకే ఉండేది. నవాబుల కాలం నుంచీ హోలీ తెలంగాణా ప్రాంతంలో బాగానే జరుపుకోవటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ హోలీ పండుగ రాష్ట్రమంతటా వ్యాపించింది.

కొత్తదనం పోయి మనుషులు కలిసిపోవటానికి చేసుకునే ఈ వేడుకలో వర్ణభేదం లేదని చెప్పటానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది ఈ రంగులు చల్లుకునే ఆనవాయితీ. ఉత్తర భారతంలో ఈ పండుగ కోసం నెలల తరబడి ఎదురు చూసేవారుండేవారు. ముఖ్యంగా యువత. ఆ రోజు యువతీ యువకులు కూడా దగ్గరవటానికి ఒక వంకగా కూడా ఈ పండుగ పనికివచ్చేది. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో అంతే. ఆ రోజు అంతా సరదాగానే ఉండాలి కానీ ఆట పట్టించినవారిమీద అలగటం కానీ కయ్యానికి పోవటం కానీ ఉండగూడదు. ఇలాంటి నియమాల వలన రోజంతా సరదాగా గడిపే పండుగైంది హోలీ. కాకపోతే చల్లుకుంటున్న రంగులు అయిపోయిన తర్వాత ఏది బడితే అది చల్లుకోవటం లాంటి విపరీత ధోరణులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి.

కానీ మారుతున్న కాలంలో, విస్తరిస్తున్న నగర నాగరికతలో ఇలాంటి వేడుకలు పెద్దవాళ్ళకి, అధికారులకూ కొద్దిగా తలనొప్పి తెచ్చిపెట్టే విషయంగా మారుతుండటంతో ప్రతి సంవత్సరం ఆంక్షలు పెట్టటం మొదలు పెట్టారు. మీకు తెలిసిన వాళ్ళ మీద, వాళ్ళు ఒప్పుకుంటేనే రంగులు చల్లుకోవాలనే నియమం వచ్చింది. ఇక ఉగ్రవాదుల భయంతో బహిరంగ ప్రదేశాలలో రంగులు చల్లుకోగూడదని, బార్ లు, మద్యం దుకాణాలను మూసివేయాలనే ఆంక్షలు కూడా పెట్టవలసి వస్తోంది. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ పరుగులు పెట్టే సమయంలో పరిస్థితిని అదుపు చేయటం కష్టమౌతుంది. పైగా ముఖమంతా రంగులు, వేసుకున్న దుస్తులన్నీ రంగులమయం అవటంతో మనుషులను గుర్తు పట్టటం కూడా కష్టమే కాబట్టి ఏదైనా గొడవలు మొదలైనప్పుడు పరిస్థితిని నియంత్రణలోకి తేవటం తలకిమించిన పనౌతుంది.

అందుకే హైద్రాబాద్ నగరంలోనూ 27 సాయంత్రం నుంచి 28 ఉదయం వరకూ బార్ లను, మద్యం దుకాణాలనూ మూసివేయమని, జనసామాన్యానికి ఇబ్బంది కలిగించేలా బహిరంగంగా రంగులు చల్లుకోవటం వద్దని ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్లు ప్రకటనలిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly heated over cag
Chandrababu woos vallabhaneni vamsi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles