Swiss national gang raped in mp

gang rape, swiss national, madhya pradesh, gwalior

swiss national gang raped in mp

gang-rape-in-mp.png

Posted: 03/16/2013 02:30 PM IST
Swiss national gang raped in mp

మధ్యప్రదేశ్ లో డాటియా జిల్లాలో నిన్న రాత్రి స్విస్ యువతి మీద ఎనిమిది మంది సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది.

దాటియా పోలీస్ కమిషనర్ చెప్పిన దాని ప్రకారం, ఆర్చాలో బస చేసిన ఆమె, ఆమె భర్త వాళ్ళు పర్యటిద్దామనుకున్న పద్ధతిలో సైకిళ్ళ మీద ఆ ప్రాంతాన్నంతా చూడటానికి తిరుగుతుండగా ఎనిమిది మంది వాళ్ళ మీద పడి వారి దగ్గరున్నవి లాక్కుని, ఆ యువతిని సామూహికంగా అత్యాచారానికి గురిచేసారు.

అత్యాచారం చేసినవారి గుర్తులు ఇంకా తెలియలేదు. గుర్తు తెలియనివారిగా వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అనుమానం మీద కొందరిని అదుపులోకి తీసుకున్నారు కానీ నిజాలింకా బయటపడలేదు.

వైద్య చికిత్స చేస్తున్న గ్వాలియర్ లోని కమలరాజే హాస్పిటల్ లో చేసిన వైద్య పరీక్షలో ఆమె మీద అత్యాచారం జరగటం నిజమేనని ధృవీకరించారు.

ఒకప్పుడు భారత దేశమంటే పని లేక ఆకలితో ఉంటూ, ఎవరు కనిపించినా చెయి చాచి అడుక్కునేవారే ఎక్కువ మంది ఉంటారన్న అభిప్రాయముండేది. ఇప్పుడు తినటానికి తిండి సమస్య చాలావరకు పోయింది కానీ లైంగికతృప్తి లేక కనిపించిన వారినందరి మీదా అత్యాచారం చెయ్యాలనిచూసేవారు పెరిగిపోయారన్న అభిప్రాయం ప్రపంచవ్యాప్త మవబోతోంది. ఆడవాళ్ళకిక్కడ భద్రత లేదు అన్న పేరు పడుతోంది.

-శ్రీజ

related article of the author

http://www.teluguwishesh.com/teluguhome/376-topnews/42856-international-womens-day-.html

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anjireddy creamatedpng
Kavita daughter claims forced marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles