Pm assures of strict action against defaulters

prime minister of india, manmohan singh, rajyasabha, cag

pm assures of strict action against defaulters

strict-on-defaulters.png

Posted: 03/06/2013 03:50 PM IST
Pm assures of strict action against defaulters

pm-assures-rajyasabha

ఈరోజు రాజ్యసభలో, రైతు ఋణాల విషయంలో అవినీతి జరిగిందంటూ కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రతిపక్షాలు రాజ్యసభలో గందరగోళాన్ని సృష్టించాయి.  భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ జీరో అవర్ లో లేవనెత్తిన రైతుఋణాల మాఫీ విషయంలో అవకతవకలు జరిగాయన్న అంశం మీద ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విరుచుకుపడ్డాయి.  వాళ్ళని సమాధానపరచటం కోసం రైతు ఋణాల ఎగవేతదారులను వదిలిపెట్టమని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అంటూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హమీ ఇచ్చారు.

ఆ మాటలతో సంతృప్తి చెందని భాజపా సభ్యులంతా పోడియం ని చుట్టముట్టారు.  దానితో ఉపసభాపతి పి.జె.కురియన్ సభను వాయిదా వేసారు.

ఋణాలకు అర్హతలేని 34 లక్షల మందికి ఋణాలు ఇవ్వటం, అర్హత గల 24 లక్షల మందికి ఋణాలు లభించకపోవటం జరిగిందని కాగ్ నివేదిక చెప్తోంది.  ఇది చాలా పెద్ద అవినీతి అవకతవకని, బ్యాంక్ అధికారులు, మధ్యవర్తులు కుమ్ముక్కై రైతులకు చెందవలసిన ఋణ సహాయాన్ని స్వాహా చేసారంటూ భాజపా ఆందోళన చేసింది.  మహారాష్ట్రలో ఈ పథకాన్ని ఆవిష్కరించటానికి సాక్షాత్తూ ప్రధాన మంత్రే విదర్భ వెళ్ళిన విషయాన్ని కూడా రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేసారు.  రైతులేమో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వారికందాల్సిన సహాయాన్ని ఫైనాన్స్ కంపెనీలు తినేసాయని ఆరోపించారు.

ఆ తర్వాత, ఇది ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వంమంటూ నినాదాలు చెయ్యటం కూడా జరిగింది.  సభను నిలిపివేయమని భాజపా సభ్యులంతా గగ్గోలు పెట్టారు.  అయితే, సభను వాయిదా వెయ్యవలసిన అవసరం లేదు.  మీకు ప్రధాన మంత్రి సమాధానం కూడా చెప్పారు కదా, ఇప్పుడు సభలోని మిగతా కార్యక్రమాలకు అడ్డురావటం సమంజంసం కాదు అంటూ ఉప సభాపతి సభను వాయిదా వెయ్యటానికి నిరాకరించారు.  అయితే పరిస్థితుల దృష్ట్యా 10 నిమిషాలు వాయిదా వేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agusta westland helicopters scam
Intermediate exams started in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles