Ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu

ys sharmila reddy, ys sharmila reddy padayatra, cm kiran kumar reddy, chandra babu naidu, chandrababu naidu padayatra, sharmila fire on cm kiran kumar reddy,

ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu

ys-sharmila-reddy.gif

Posted: 02/14/2013 07:46 PM IST
Ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu

ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడ్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఒకే సారి షర్మిల ఉతికి ఆరేశారు. హాలియాలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  షర్మిల రెచ్చిపోయారు. రాష్ట్రానికి ఈ ఇద్దరు ఏం చేశారో చెప్పాలని  ఆమె డిమాండ్  చేశారు. నల్గొండ జిల్లాలోని జానారెడ్డి నేతృత్వం వహిస్తున్న హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ..వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రచారానికి కోట్ల రూపాయలు సీఎం ఖర్చు చేస్తున్నారని.. అయితే ఇప్పటివరకు ఎవరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కరెంట్‌ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు రాష్ట్రంలో 108 వాహనం ఎక్కడా కనిపించడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  జానారెడ్డి గత 30ఏళ్లుగా అధికారం అనుభవిస్తున్నారని.. సొంత నియోజకవర్గాన్ని కూడా చక్కదిద్దుకోకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. అంతేకాకుండా తాగునీరు కూడా అందించని మంత్రి ఒక మంత్రేనా అని తీవ్రస్థాయిలో షర్మిల విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన బాబు వేల కోట్లు సంపాదించారని.. అసమర్ధ ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే సాక్షిపై దాడి జరిగిందని.. చంద్రబాబుది నిజమైన పాదయాత్ర కాదని..వైఎస్‌ఆర్ చేసిన పాదయాత్ర మహాయజ్ఞంలా ఉండేదని షర్మిల తెలిపారు. జగనన్న తర్వలోనే బయటకు వస్తారు.. రాజన్న రాజ్యం వస్తుందన్నారు. బోనులో ఉన్నా... సింహం సింహమేనని షర్మిల అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla sairaj join ysr congress
Chandrababu escapes accident in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles