Chargesheet on swamy goud

swami goud, telangana, hyderabad

Begum Bazzar Police filed a chargesheet on former TNGO leader Swamy Goud

chargesheet on swamy goud.png

Posted: 02/06/2013 05:03 PM IST
Chargesheet on swamy goud

swamy-goud_మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ కి షాక్ తగిలింది. గచ్చిబౌలిలోని ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అక్రమ వ్యవహారంలో స్వామి గౌడ్ కి హస్తం ఉన్నట్లు ఆయన పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వామిగౌడ్ రిటైర్మెంట్ అయి, టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భరిలో దిగుతున్న సమయంలో.... ఇళ్ళ స్థలాల కేసుకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బేగంబజార్ పోలీసులు ఈ రోజు స్వామి గౌడ్ కేసు విషయంలో పురోభివృద్ధిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి తాము ఛార్జీషీటు దాఖలు చేసినట్లు చెప్పారు. ఆయనపై నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో విచారణ సాగుతోందని తెలిపారు. స్వామి గౌడ్ పైన 404, 406, 420, 120(బి), 156(3) సెక్షన్ల క్రింద అభియోగాలు మోపినట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే టైంలో ఇతని పై పోలీసులు ఎఫైర్ నమోదు చేయడం ఇతనికి ఇబ్బంది కలిగించే విషయమే. ఇక ఇళ్ళ స్థలాలకు సంబంధించిన సొసైటీని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో దీనిపై పూర్తి స్థాయి విచారణకు కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Party high command fire on botsa
Gangrape victim father requested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles