Komatireddy brothers fire on congress party

komatireddy brothers, Congress party, telangana issue, komatireddy venkata reddy, komatireddy rajagopal reddy, mp komatireddy rajagopal, kcr, telangana meeting,

komatireddy brothers fire on congress party

komatireddy brothers.gif

Posted: 01/25/2013 04:01 PM IST
Komatireddy brothers fire on congress party

komatireddy brothers fire on congress party

ఈ నెల 28లోగా తెలంగాణ రాకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చిచెప్పారు. కేసీఆర్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలకే కాదు, తమకు చీము, నెత్తురు ఉందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏం చేయాలో అది చేస్తామని స్పష్టం చేశారు. మున్ముందు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీనామాల బెదిరింపులతో సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌తో ఆయన సుమారు రెండు గంటలకు పైగా చర్చించారు.  అయితే  కోమటి రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  కాంగ్రెస్ పార్టీ మండి పడ్డారు. ఈ నెల 28లోగా తెలంగాణపై నిర్ణయం రాకుంటే కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకుంటామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎంపీలమంతా ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణవాదాన్ని అవహేళన చేసే విధంగా ఆజాద్ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆజాద్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడకుండా, నిర్దిష్ట గడువు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పారు. కేసీఆర్‌ను మా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలవడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth comes out in support of kamal haasan
Tpjac samara deeksha from jan 27th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles