Tg says high command is favour telangana

tg venkatesh, rayalaseema, erasu pratap reddy, telangana, new delhi.

The minister from Rayalaseema TG Venkatesh said that Congress high command is in favour of Telangana. TG Venkatesh along with Seemandhra region ministers met Vayalar Ravi and Ghulam Nabi Azad

tg  says high command is favour telangana.png

Posted: 01/16/2013 08:22 PM IST
Tg says high command is favour telangana

Venkateshకర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్ ఇవాళ ఢిల్లీలోని పలువురు నాయకుల్ని సీమాంద్ర నేతలతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేష్ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు చూస్తుంటే... తెలంగాణ ఇచ్చే విధంగానే కనిపిస్తుందని, తెలంగాణ పట్ల అధిష్టానానికి ఓ విధమైన సానుభూతి ఉందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... త్వరలోనే అధిష్టానం తెలంగాణ పై ఓ ప్రకటన చేయడం ఖాయం గా కనిపిస్తుందని, కానీ మాతో తెలంగాణ ఖచ్చింతంగా ఇస్తామని మాత్రం చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల ఇబ్బందులను అధిష్టానం తమకు చెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని అధిష్టానం నాయకులు తమతో చెప్పిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతాయని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్య తలెత్తుతుందని, నీటి యుద్ధాలు జరుగుతాయని ఆయన అన్నారు. దేశంలోని సమస్యలతో తెలంగాణ సమస్య ఇమిడి ఉందని ఆయన అన్నారు. మరి టీజీ వెంకటేష్ మాటలను బట్టి చూస్తుంటే అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందని భావించవచ్చా ? లేక తెలంగాణ వాదులను మభ్య పెట్టేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడా అనేది ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin owaisi judicial custody till jan 22
Kcr is eligible best farmer award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles