మహిళలపై పెరిగిపోతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాల రూపకల్పన దిశగా కాంగ్రెస్ ముసాయిదా బిల్లును తయారు చేస్తోంది. అత్యాచారాల కేసుల్లో నిందితులకు 30 ఏళ్ల వరకు జైలుశిక్ష, అరుదైన కేసుల్లో భవిష్యత్తులో వారు సెక్సుకు పనికిరాకుండా రసాయనాలతో నపుంసకులుగా (కెమికల్ కాస్ట్రేషన్) మార్చడం లాంటి పలు కఠిన చర్యలను అందులో ప్రతిపాదిస్తోంది. ఢిల్లీలో 23 ఏళ్ల యువతి అత్యంత క్రూరంగా అత్యాచారానికి గురైన ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్.వర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి ఈ ముసాయిదా బిల్లును సమర్పించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అత్యాచారాల బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడం, నిందితులకు గరిష్ట శిక్ష విధించడం లాంటి చర్యలకు వీలుగా చట్టాలను సవరించేందుకు తగిన సిఫారసుల కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్మ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముసాయిదా బిల్లు సిద్ధం చేస్తోంది. అత్యాచార దోషులకు మూడు నెలల్లో శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలని, బాల నేరస్తుల వయసు పరిమితిని మరింత తగ్గించాలని సూచించింది. కొన్ని దేశాలలో రేప్ చేసినవారిని రసాయన పద్దతులలో నపుంసకులుగా మార్చే శిక్షలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ శిక్షల ద్వారా మన దేశంలో లైంగిక దాడులు తగ్గిపోవచ్చు. కానీ వాటిని అక్రమంగా అమలుచేస్తేనే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more