Slapping of prachanda reflects disillusionment

maoist chairman pushpa kamal dahal prachanda, disllusionment, padma junwar, tea reception, slapping, Sushil Koirala, Nepal politics

Slapping of Prachanda reflects disillusionment

Prachanda.gif

Posted: 11/17/2012 12:34 PM IST
Slapping of prachanda reflects disillusionment

Slapping of Prachanda reflects disillusionment

నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ(57)కు ఓ యువకుడి చేతిలో చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీకి చెందినవాడిగా భావిస్తున్న ఓ యువకుడు ఆయనను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. దీపావళి, ఛాత్, నేపాలీ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రచండ సారథ్యంలోని యూసీపీఎన్ (మావోయిస్టు) పార్టీ ఇచ్చిన తేనీటి విందులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా అందరూ చూస్తుండగానే యువకుడు ప్రచండ చెంపపై కొట్టాడని, ఆయన కళ్లద్దాలు కూడా ఎగిరిపోయాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని పశ్చిమ నేపాల్‌లోని బగ్లుంగ్ జిల్లాకు చెందిన పవన్ కున్వర్ ( 25)గా గుర్తించారు. అయితే, దీనిపై ఆగ్రహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు వెంటనే పవన్‌ను చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడిని తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విందుకు నేపాల్ ప్రధాని బాబూరాం భట్టారాయ్, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా, సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ ఝలానాథ్ ఖనల్, మధేషీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్రయాదవ్‌తోపాటు వివిధ పార్టీల సీనియర్ నేతలు హాజరయ్యారు. కాగా, మళ్లీ ఎన్నికలు నిర్వహించి దేశంలోని రాజ్యాంగ, రాజకీయ సంక్షోభాన్ని రూపుమాపడంలో మావోయిస్టు పార్టీ, ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వం విఫలమయ్యారంటూ ఈ సందర్భంగా నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మధేషీ పార్టీల నేతలు విమర్శించారు. రాజ్యాంగాన్ని త్వరగా ఆమోదించేందుకుగాను పార్టీలన్నీ ఏకాభ్రిపాయం, సహకారంతో జాతీయ ఏకతా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  5 hour energy drinks cited in 13 deaths
Kodandaram says sorry to geetha reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles