Central cabinet expansion

Central cabinet expansion.png

Posted: 10/28/2012 12:16 PM IST
Central cabinet expansion

యూపీఏ ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో భారీ పునర్ వ్యవస్థీకరణకు తెర లేచింది. 2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది. కొత్తగా మంత్రి పదవులు పొందే వారు ఈ రోజు ఈ ఉదయం 11:30 గంటలకు కొత్తమంత్రులు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. పాత వారికి ప్రమోషన్లు ఇస్తూ, కొత్త వారికి ఈ కేబినెట్ లో స్థానం కల్పించనున్నారు.  ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మునియప్పకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఆయనకు ఉపరితల రవాణాశాఖ కేటాయిస్తారు. విద్యుత్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పెట్రోలియం శాఖ మంత్రిగా గులాంనబీ ఆజాద్, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా అజయ్ మాకెన్ను నియమించనున్నారు. మానవవనరుల శాఖను కపిల్ సిబల్ నుంచి పల్లంరాజుకు అప్పగిస్తారు. కపిల్ సిబల్ టెలికాంశాఖను కేటాయించనున్నారు.. విదేశాంగ మంత్రి పదవి అభ్యర్థిగా సల్మాన్ ఖుర్షీద్ ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఎస్.ఎం.కృష్ణ స్థానంలో ఖుర్షీద్కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.

రాష్ట్రం నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్న పల్లంరాజుకు కేబినెట్ హోదా లభించనుంది. ఆయనకు మానవవనరుల అభివృద్ధి శాఖ( కేబినెట్), జైపాల్ రెడ్డికి శాస్త్రసాంకేతిక శాఖ ( కేబినెట్), చిరంజీవికి పర్యాటక శాఖ సహాయమంత్రి ( స్వతంత్ర), పురంధేశ్వరికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర), కోట్ల సూర్యప్రకాశ రెడ్డికి షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి, సర్వే సత్యనారాయణకు రైల్వేశాఖ సహాయ మంత్రి, బలరాం నాయక్కు సామాజిక న్యాయ సహాయ మంత్రి, కిల్లి కృపారాణికి వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి పదవులు లభించనున్నాయి. ఈ కేబినెట్ లో స్థానం దక్కిన వారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్నవారే. మరి వీరు ఏ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayakanth loses temper at media
Crime report for sunday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles