Vastunna meekosam

VASTUNNA MEEKOSAM, Candhra babu Naidu, Padayatra, Van, Tdp, Leaders,

VASTUNNA MEEKOSAM

VASTUNNA.gif

Posted: 10/05/2012 06:03 PM IST
Vastunna meekosam

VASTUNNA MEEKOSAM

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నందమూరి తారకరామారావును నాడు నడిపించింది 'చైతన్యరథం'. నేడు అదే పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు నడిపిస్తోంది మరో ఆధునిక వాహనం. అవసరాలకు అనుగుణంగా పార్టీ నేతల సూచనల మేరకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

+ ఈ బస్సును ముంబైకి చెందిన ఓ ప్రముఖ ట్రావెల్స్ సంస్థ సమకూర్చింది. ఇలాంటి బస్సులనే ప్రస్తుతం ముంబైలో సినీ పరిశ్రమ వర్గాలకు అందిస్తోంది.

+ లీటరు డీజిల్‌తో ఇది 3 కిలోమీటర్లు నడుస్తుంది. 150 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకు ఉన్నందువల్ల నిరాటంకంగా 450 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

+ వోల్వో బస్సుకన్నా 1.5 అడుగులు ఎక్కువ పొడవుతో దీన్ని తయారు చేశారు.

+ ఒకరోజుకి అద్దె రూ. 15 వేలు... ఇందులో బాత్‌రూం సదుపాయాలున్నాయి.

+ 2 పడకగదులు, సమావేశాల కోసం గది.. బాబుకు మరో గది ఏర్పాటు చేశారు.

+ బస్సుకు ప్రత్యేకంగా ఓ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. బస్సు ఆగి ఉన్నా దీని సాయంతో ఎయిర్ కండిషన్ వ్యవస్థ, లైట్లు పనిచేసే ఏర్పాట్లున్నాయి.

+ బస్సులో టీవీని చూసేందుకు ఏర్పాట్లున్నాయి. రోజూ ఉదయం పత్రికలతోపాటు టీవీ చానళ్లను చూసిన అనంతరం బాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

+ ఈ బస్సుకోసం రూ.17.5 లక్షలు ఖర్చవుతుండగా, పార్టీయే భరించనుంది.

+ నీటి నిల్వ కోసం బస్సు పైభాగాన 500 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏరోజుకారోజు అంటే పాదయాత్ర ముగిశాక రాత్రివేళ ట్యాం కును నింపుతారు. ఈ ఖర్చును సత్యప్రసాద్ అనే పార్టీ అభిమాని భరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama vs rommy
The world top 100 universities 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles