Doctors fired on guntur collector

doctors fired on guntur collector

doctors fired on guntur collector

doctors.gif

Posted: 09/01/2012 11:36 AM IST
Doctors fired on guntur collector

doctors fired on guntur collector

అనూహ్యంగా ఆస్పత్రిలో ప్రత్యక్షమై..వైద్య సిబ్బంది హాజరుపట్టిని పరిశీలించి, పనిచేయాల్సిన టైమ్‌లో బయట తిరుగుతున్నవారిని నిలదీసిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ వైఖరి సమగ్రాస్పత్రి వైద్యులకు మింగుడు పడటంలేదు. విధులకు ఆలస్యంగా వచ్చిన 34 మంది వైద్యులకు కలెక్టర్ స్వయంగా ఆబ్సెంట్ వేయడంపై అసహనంతో రగిలిపోతున్నారు. పైగా.. ఈ వ్యవహారమంతా మీడియాలో ప్రముఖంగా రావడంతో కలెక్టర్‌పై గుర్రుమంటున్నారు. శుశ్రుతహాల్‌లో జరిగిన సమావేశంలో ఆ ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారు. ఆస్ప త్రి స్థాయిలోని వైద్యులంతా హాజరైన ఈ భేటీలో కలెక్టర్ తీరును తప్పుబట్టారు. కొద్ది మంది ఆలస్యానికి అందరినీ మీడియాలో పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సక్రమంగా పని చేయకపోతే గుంటూరు జీజీహెచ్‌కు ఇంత పేరు వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. వారంతా ఇన్‌చార్జీ సూపరింటెండెంట్‌ను కలిసి కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. వైద్యవిద్య సంచాలకులు విష్ణుప్రసాద్‌కు విషయంచెప్పి వాపోయారు."రాద్దాంతం వద్దు. విధులకు సరిగ్గా హాజరుకండి.మిగతా విషయాలు అవే పరిష్కారమవుతాయ''ని ఆయన.. వైద్యులకు సర్దిచెప్పారు.దీనిపై కలెక్టర్‌ను సంప్రదించగా ఈ విషయమై వారెవరూ నన్ను సంప్రదించలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One dead in 76 quake off philippines
Ysr congress bandh call evokes poor response  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles