Dsc exam starts from today

dsc exam starts from today

dsc exam starts from today

15.gif

Posted: 08/26/2012 02:10 PM IST
Dsc exam starts from today

       రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ పరీక్ష కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు dsc_1జరగనున్నాయి. మొత్తం 21వేల 343 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జీటీ, లాంగ్వేజి పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు 4 లక్షల 23వేల మంది దరఖాస్తు చేశారు. 26, 27, 28 తేదీల్లో జరిగే పరీక్షకోసం  రాష్ట్రవ్యాప్తంగా 1874 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 31, 462 మంది అభ్యర్థులు  పరీక్షకు హాజరవగా, అత్యల్పంగా హైదరాబాద్ లో 7,824 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు.. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్  పేపర్ ఉదయిం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు..... స్కూల్ అసిస్టేంట్ నాన్ లాంగ్వేజ్ పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరగనున్నాయి.
     27 వతేదీ ఉదయం ఎస్జీటీ సాయంత్రం పిఈటీ, లాంగ్వేజ్ పండిట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక 28 ఉదయం ప్రత్యేక పాఠశాలల్లో లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ ఉద్యోగాలకు పరీక్ష జరగనుంది. dsc_2మూడురోజులూ పరీక్షలు ఎటువంటి అడ్డంకులలేకుండా జరిగేందుకు డిఎస్పీ పరీక్ష కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.  అభ్యర్థులు  గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని...ఆలస్యం అయితే లోనికి అనుమతించరని తెలిపారు.  అటు డిఎస్సీ రాతపరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎన్  శివశంకర్  కూడా సూచనలు చేశారు. పరీక్ష రోజు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే అనుమతించమని తెలిపారు. సెల్ ఫోన్ లు,ఎలక్ట్రానిక్  వస్తువులను పరీక్షా కేంద్రానికి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షల్లో ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డా ఎపియాక్ట్  25/1997, ఇతర చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు జరిగే తేదీల్లో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central aid for state
Trs leaders meet cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles