Section of chinas great wall collapses in heavy rains

Section of China's Great Wall collapses in heavy rains,collapse, Great WallOf China, repair

Section of China's Great Wall collapses in heavy rains

Wall.gif

Posted: 08/10/2012 06:41 PM IST
Section of chinas great wall collapses in heavy rains

Section of China's Great Wall collapses in heavy rains

ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిపొంది, కోట్లాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న, అతి ప్రాచీనమైన ‘చైనా గ్రేట్‌ వాల్‌’ లో కొంతభాగం కూలిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర చైనా లోని హెబీ ప్రావిన్స్‌లో గ్రేట్‌ వాల్‌లో కూలిన భాగానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. కొన్ని రోజులుగా ఆగకుండా వానలు కురుస్తుండడంతో పర్వతాల నుంచి బలమైన నీటి ప్రవాహాలు వచ్చి తాకడంతో ఝాంగీయాకోవులోని గ్రేట్‌ వాల్‌లో డాజింగ్‌మెన్‌ సెక్షన్‌లోని గోడ కూలిపోయిందని క్వియావోక్సీ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. సెక్షన్‌లో కూలిన 36 మీటర్ల ప్రాంతాన్ని నిపుణులు శుభ్రపరిచారు.

Section of China's Great Wall collapses in heavy rains


అంతేకాక, ముందు ముందు కూలకుండా ఉండేందుకు గోడలో బలహీనంగా ఉన్న భాగాలను పటిష్టపరిచారు. కూలిన గోడ దగ్గర ఇతర ప్రదేశాల్లో కూడా పగుళ్లు కనిపించాయి. దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయాలని సాంస్కృతిక చిహ్నాల పరిరక్షక నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. మింగ్‌ వంశం చైనా ను పాలించిన కాలంలో (1368-1644) డాజింగ్‌మెన్‌ సెక్షన్‌లోని గోడను నిర్మించారు. ఇన్ని శతాబ్దాలుగా ఏర్పడిన భూమికోత కూడా గోడ కూలడానికి కారణమైందంటున్నారు. వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచీ చైనా లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాంతో దేశంలో వరదలు వెల్లువెత్తాయి. బీజింగ్‌లో ఇంత అతిగా వానలు కురవడం అరవై ఏళ్లలో ఇదే మొదటిసారి. వానలకు 79 మంది మరణించారు. జనజీవనం స్తంభించిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Belgian cyclist kicked out of olympics after drunken night
Hun sen cambodia prime minister marathon speech lasts 5 hours on national tv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles