'దక్కన్ క్రానికల్' గ్రూప్‌కు మరో దెబ్బ తగిలింది! ఓ ఆర్థిక లావాదేవీలో భారీ మోసానికి పాల్పడిందంటూ క్యాపిటల్ మార్కెట్ సర్వీసుల రంగంలోని ప్రముఖ సంస్థ కార్వీ గ్రూప్ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కార్వీ ప్రతినిధులు సీసీఎస్ డీసీపీ జాన్ విక్టర్‌కు ఈ ఫిర్యాదు అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు ద్రువీకరించారు.అయితే... ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడంతో, ఫిర్యాదులోని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. కార్వీ చేసిన ఫిర్యాదుపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మతో డీసీపీ జాన్ విక్టర్ చర్చించినట్లు తెలిసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోలీసులకు న్యాయపరమైన సలహా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో... అసలు ఫిర్యాదు ఏమై ఉంటుందనే విషయంపై రకరకాల ఊహగానాలు వినవస్తున్నాయి.
డిబెంచర్ల రిడెంప్షన్‌కు సంబంధించి 27.8 కోట్ల రూపాయలను చెల్లించడంలో డీసీ విఫలమైందని ఆరోపిస్తూ ఐఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. దక్కన్ క్రానికల్ ఆర్థిక పరిస్థితిపై తన పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలే చేసింది. "వేల కోట్ల అప్పులు చేసిన ఈ సంస్థ... వాటిని తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేదు. అందువల్ల... దానిని మూసేసి, ఆస్తులు అమ్మి మా సొమ్ములు ఇప్పించండి'' అని హైకోర్టును కోరింది.మరోవైపు... డీసీ ప్రమోటర్లు 54 శాతం వాటాను ఫ్యూచర్స్ క్యాపిటల్ వద్ద తాకట్టు పెట్టడం కంపెనీ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలకు బలం చేకూర్చింది. వరుసగా వస్తున్న ప్రతికూల వార్తలతో డీసీ హోల్డింగ్స్ షేరు ధర మంగళవారం మరో కొత్త కనిష్ఠ స్థాయి... 15.45 రూపాయలకు దిగజారింది. గత 15 రోజుల్లో ఈ షేరు ధర దాదాపు 50 శాతంమేర పతనమైంది. మార్కెట్ పరిస్థితి దక్కన్ క్రానికల్ గ్రూప్‌నకు పూర్తి అడ్డంగా తిరిగిన సమయంలోనే కార్వీ కూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... కార్వీ ప్రతినిధులు మాత్రం తాము డీసీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆ గ్రూప్‌తో తమకు ఆర్థిక లావాదేవీలేమీ లేవని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more