Bharath in olympic games

bharath in olympic games

bharath in olympic games

35.gif

Posted: 07/30/2012 07:21 PM IST
Bharath in olympic games

       భారత క్రీడారంగ అభిమానులకు సంతోషకర వార్త. ఒలంపిక్ క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో హైదరాబాద్ కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని భారత్ కు సాధించి పెట్టాడు. దాంతో ఒలంపిక్ పతకాల పట్టికలో భారత్ ఖాతా narangతెరించింది. ఈ ఘనత సాధించగానే భారతీయ జెండా ఒలంపిక్స్ లో రెపరెపలాడింది. ఈ ఈవెంట్ లో నారంగ్ కు 701.1 పాయింట్లు లభించాయి. తొలి షాట్‌ నుంచే చైనా షూటర్‌ వాంగ్‌తో గట్టి పోటీ ఎదుర్కొన్న నారంగ్.. ఫైనల్‌ షాట్‌లో అతన్ని అధిగమించి బ్రాంజ్‌ మెడల్‌ ఎగరేసుకుపోయాడు. క్వాలిఫయర్స్‌లో 598 పాయింట్లు, ఫైనల్లో 103.1 పాయింట్లు సాధించాడు నారంగ్‌. ఈ ఈవెంట్ తొలి స్థానంలో రొమేనియా షూటర్‌ మొల్దొవీను, రెండోస్థానంలో కాంప్రియాని నిలిచారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన గగన్‌కు.. ఇదే తొలి ఒలింపిక్‌ మెడల్‌. గతంలో రెండు ఒలింపిక్స్‌లో పాల్గొన్న నారంగ్‌ పతకం సాధించడంలో విఫలయమ్యాడు. లండన్‌లో మరో రెండు ఈవెంట్స్‌ లో పార్టిసిపేట్‌ చేస్తున్న నారంగ్‌ నుంచి మరిన్న పతకాలు ఆశించవచ్చు. ఆల్ ద బెస్ట్ నారంగ్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kampli mla suresh babu arrested
Mlc konda murali suspension  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles