రంగురంగుల విద్యుద్దీపాలతో, నింగినంటిన బాణసంచా మెరుపులతో లండన్ నగరం మెరిసిపోయింది. ప్రతిష్ఠాత్మక లండన్ ఒలింపిక్స్ రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 19 రోజులపాటు జరిగే ఈ పోటీలు ప్రపంచ క్రీడాభిమానులకు కనువిందుచేయనున్నాయి. తొలిరోజునే ఒలింపిక్స్‌లో సంచలనాలకు తెరలే చింది. అర్చరీ విభాగంలో దక్షిణ కొరియా అంధ విలుకాడు ఇమ్ డాంగ్ హ్యూన్ రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి సంచలనం సృష్టించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన సింగం సాయి విశాల్ లండన్ ఒలింపిక్స్ టార్చి రిలేలో పాల్గొని అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. కాగా, ఒలింపిక్స్ పోటీలు మొదలై మూడ్రోజులైనా పతకాల పంట పండేది మాత్రం నేటినుంచే. అలాగే భారత్ అసలు సిసలు సమరం కూడా.
శుక్రవారం కేవలం ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో పాల్గొన్న భారత్.. శనివారం పలు క్రీడాంశాల్లో పోటీపడుతోంది. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, శివథాపా, తెలుగుతేజాలు కశ్యప్, జ్వాల, సానియా, మహిళా వెయిట్‌లిఫ్టర్ సోనియా చాను, షూటర్ విజయ్‌కుమార్ తదితరులు బరిలోకి దిగుతున్నారు. ఇవాళ (శనివారం) ఫలితం తేలే మూడు క్రీడాంశాల్లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వీటిలో పురుషుల ఆర్చరీ టీమ్, పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్, మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలున్నాయి. అయితే, ఈ మూడింటిలోనూ భారత్‌కు పతకం వచ్చే అవకాశాలు తక్కువే. ఏదైనా అద్భుతం జరిగితేనే సాధ్యం. నేటి పోటీల్లో విశేషం ఏమిటంటే తెలుగుతేజాలు తమ సత్తా చాటబోతున్నారు. ఇవాల్టి పోటీల్లో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కశ్యప్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ లో జ్వాల, టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా సమరానికి సన్నద్ధమయ్యారు. రష్మీ చక్రవర్తితో కలసి బరిలోకి దిగుతున్న సానియా తొలిరౌండ్లో చైనీస్‌తైపీ జోడీ చ్వాంగ్, సీహ్‌తో తలపడనుంది. ఇక కశ్యప్ గ్రూప్ దశలో టాన్ యుహాన్ (బెల్జియం)తో, మహిళల డబుల్స్‌లో అశ్వినీతో కలసి జ్వాల.. ఫుజి/కకీవా (జపాన్)తో, మిక్స్‌డ్‌లో దిజుతో జతకట్టి నట్సిర్/అహ్మద్ (ఇండోనేసియా)తో పోటీపడుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more